Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వింగ్ కాదు.. ఆ ఇద్దరే గెలిపించారు: రజత్ పాటిదార్

తమ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో విజయం సాధించామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. పిచ్‌పై స్వింగ్ మాములుగానే ఉందని, భువీ, హేజిల్‌వుడ్ సరైన లెంగ్త్‌ల్లో బౌలింగ్ చేసి వికెట్లు తీసారని, ఈ గెలుపు క్రెడిట్ వారిదేనని స్పష్టం చేశాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 81 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడంతో ఆర్‌సీబీ రన్‌రేట్ రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పాటిదార్.. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు.

క్రెడిట్ భువీ, జోష్‌దే..

'ఈ పిచ్ స్పందించిన తీరు చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఈ గెలుపు క్రెడిట్ అంతా మా బౌలర్లు భువీ, హేజిల్‌వుడ్‌లకే దక్కుతుంది. వారు సరైన లెంగ్త్‌ల్లో బౌలింగ్ చేశారు. వికెట్‌పై స్వింగ్ మామూలుగానే ఉంది. కానీ ఆరంభంలోనే వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. సుయాష్ బౌలింగ్ చేసిన తీరు.. స్టంప్ టు స్టంప్ లైన్ చాలా బాగుంది.

Rajat Patidar Credits Bhuvneshwar Kumar and Josh Hazlewood for RCB s Commanding Win Over DC
Photo Credit: screen grab for JioHotstar

బౌలర్లు వారి రొటీన్‌లను అనుసరించడం చాలా ముఖ్యం. మేం ప్రతి మ్యాచ్‌ను విడివిడిగా చూస్తున్నాం. వేర్వేరు ఆటగాళ్లు ముందుకు వచ్చి బాగా రాణిస్తున్నారు. టీ20 క్రికెట్‌లో ఫ్లాట్ పిచ్‌లపై బౌలింగ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే బౌలర్లు మాత్రమే టైటిళ్లు గెలిపించగలరు.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.

చిత్తుగా ఓడిన ఢిల్లీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(19), కైల్ జెమీసన్(12)తో సహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సాహిల్ పరఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీష్ రాణా(1), సమీర్ రిజ్వీ(0), ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(0) తీవ్రంగా నిరాశపర్చారు.

అర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/5), జోష్ హేజిల్‌వుడ్(4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్‌ధార్ సలామ్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) అజేయంగా నిలవగా.. జాకోబ్ బెతెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్(1/42) ఒక్కడే ఒక వికెట్ తీసాడు.

Story first published: Monday, April 27, 2026, 23:27 [IST]
Other articles published on Apr 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+