Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని వల్లే ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన: జోష్ హేజిల్‌వుడ్

భువనేశ్వర్ కుమార్ సహకారంతోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశానని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అన్నాడు. భువనేశ్వర్ బౌలింగ్‌ను అనుసరించడంతోనే తనకు వికెట్లు దక్కాయని చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో జోష్ హేజిల్‌‌‌వుడ్(4/12) నాలుగు వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసిన హేజిల్ వుడ్.. తన సెకండ్ స్పెల్‌లో ఆఖరి వికెట్ పడగొట్టాడు. దాంతో హేజిల్‌‌‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

భువీని కాపీ కొట్టా..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడి. జోష్ హేజిల్‌వుడ్.. పిచ్‌ను చూసి షాకయ్యానని తెలిపాడు. 'గత మ్యాచ్‌లో ఇదే వికెట్‌పై 500 ప్లస్ పరుగులు వచ్చిన తర్వాత.. ఇలాంటి పిచ్‌ని ఊహించలేదు. నేను భువనేశ్వర్ కుమార్‌ను అనుసరించాను అంతే. మొదటి ఆరు ఓవర్లలో పిచ్ నుంచి బౌలర్లకు అడ్వాంటేజ్ లభించింది. బంతి అటు ఇటుగా వచ్చింది. బంతి పాతబడిన తర్వాత బ్యాటింగ్‌కు ఈజీ అయ్యింది.

Josh Hazlewood Credits Bhuvneshwar Kumar for Match-Winning Spell against DC in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

బ్యాటర్లు 'V' జోన్‌లోకి ఆడేలా బౌలింగ్ చేయాలనుకుంటాం. కానీ ఆ ఏరియాలో పిచ్‌లో ఏదో ఉందనిపించింది. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడం మాకు కలిసొచ్చింది. నాలుగు ఓవర్లు వేసి త్వరగా ఫీల్డ్ వదిలి వస్తే బాగుండేది (నవ్వుతూ). కానీ మేం అన్ని విభాగాల్లో రాణిస్తున్నాం. గత ఏడాది అవే గేమ్స్‌లో కూడా కండిషన్స్‌ని బాగా అర్థం చేసుకున్నాం. ఈ టోర్నీలో సరైన సమయంలో మేం ఫామ్‌లోకి వస్తున్నాం.'అని జోష్ హేజిల్‌వుడ్ తమ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.

ఆర్‌సీబీ అలవోకగా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(19), కైల్ జెమీసన్(12)తో సహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సాహిల్ పరఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీష్ రాణా(1), సమీర్ రిజ్వీ(0), ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(0) తీవ్రంగా నిరాశపర్చారు.

అర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/5), జోష్ హేజిల్‌వుడ్(4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్‌ధార్ సలామ్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) అజేయంగా నిలవగా.. జాకోబ్ బెతెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్(1/42) ఒక్కడే ఒక వికెట్ తీసాడు.

Story first published: Tuesday, April 28, 2026, 0:05 [IST]
Other articles published on Apr 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+