DC vs RCB: 8 పరుగులు.. 6 వికెట్లు!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్‌వుడ్ నిప్పులు చెరిగారు. 16 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. ఆ తర్వాత మరో వికెట్ కూడా పడగొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
పిచ్ నుంచి సహకారం లభించడంతో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్‌వుడ్ రఫ్ఫాడించారు. స్వింగ్ బౌలింగ్‌తో భువనేశ్వర్ కుమార్ బంతిని నాగినీ డ్యాన్స్ ఆడించగా.. హాజెల్ వుడ్ తన బౌన్స్‌తో ఢిల్లీ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ ఇద్దరి ధాటికి సాహిల్ పరఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీష్ రాణా(1), సమీర్ రిజ్వీ(0), ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(0) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయానికి తగ్గట్లు ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డ్..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్ ప్లే స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి పవర్ ప్లేలో 6 వికెట్లకు ఢిల్లీ 13 పరుగులే చేసింది. ఈ పవర్ ప్లేలో ఢిల్లీ ఒకే ఒక్క బౌండరీ బాదడం గమనార్హం. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ పేరిట ఉన్న లోయెస్ట్ పవర్ ప్లే చెత్త రికార్డ్‌ను ఢిల్లీ అధిగమించింది.
ఐపీఎల్ 2009 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇదే ఆర్‌సీబీపై పవర్ ప్లేలో 2 వికెట్లకు 14 పరుగులే చేసింది. అంతేకాకుండా పవర్ ప్లేలోనే 6 వికెట్లు కోల్పోయిన రెండో జట్టుగా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఐపీఎల్ 2011 సీజన్‌లో కేరళ టస్కర్క్ కొచ్చి టీమ్ డెక్కన్ చార్జెర్స్‌పై పవర్ ప్లేలోనే 6 వికెట్లు కోల్పోయింది.
ఐపీఎల్‌లో పవర్‌ప్లే (1-6 ఓవర్లు)లో అత్యల్ప స్కోర్లు:
13/6 - డీసీ vs ఆర్సీబీ, ఢిల్లీ, 2026*
14/2 - ఆర్‌ఆర్ vs ఆర్సీబీ, కేప్ టౌన్, 2009
14/3 - ఎస్‌ఆర్‌హెచ్ vs ఆర్‌ఆర్, పూణే, 2022
15/2 - సీఎస్‌కే vs కేకేఆర్, కోల్‌కతా, 2011
16/1 - సీఎస్‌కే vs డీడీ, రాయ్‌పూర్, 2015
16/1 - సీఎస్‌కే vs ఆర్సీబీ, చెన్నై, 2019
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications