చరిత్ర సృష్టించిన రింకూ సింగ్.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఫినిషర్ రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో 80కి పైగా పరుగులతో పాటు నాలుగు అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు.ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫీల్డింగ్‌లోనాలుగు కీలక క్యాచ్‌లు అందుకున్నాడు. రింకూ సింగ్ సంచలన ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో కేకేఆర్ సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును రింకూ సింగ్ అందుకున్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై ఆచితూచి ఆడిన రింకూ సింగ్.. 42 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత గేర్ మార్చి లక్నో బౌలర్లపై విరుచుకుపడి పోరాడే లక్ష్యాన్ని అందించాడు. దిగ్వేష్ రతి వేసిన ఆఖరి ఓవర్‌లో 4 సిక్స్‌లు బాది మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

ఫీల్డింగ్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, హిమ్మత్ సింగ్‌ల క్యాచ్‌లను రింకూ సింగ్ అందుకున్నాడు. సూపర్ ఓవర్‌లోనూ మార్క్‌రమ్ ఇచ్చిన క్యాచ్‌ను రోవ్‌మన్ పోవెల్‌తో కలిసి పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ ఆటగాడు కూడా ఇలా 80+ రన్స్‌తో పాటు నాలుగు క్యాచ్‌లు అందుకోలేదు.
ఈ క్రమంలో రింకూ సింగ్.. ఆడమ్ గిల్‌క్రిస్ట్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2012 సీజన్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 64 పరుగులతో పాటు 4 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ జాబితాలో రింకూ సింగ్, ఆడమ్ గిల్ క్రిస్ట్ తర్వాత రియాన్ పరాగ్(56 పరుగులు, 4 క్యాచ్‌లు), జాక్వస్ కల్లీస్(53, 4), డారిల్ మిచెల్(52 పరుగులు, 5 క్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐపీఎల్‌లో రెండుసార్లు నాలుగేసి క్యాచ్‌లు పట్టిన తొలి క్రికెటర్ కూడా రింకూ సింగ్ నిలిచాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. గతంలో అతను నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో 2022లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 29 సార్లు నాలుగేసి క్యాచ్‌లు అందుకోగా.. అందులో రింకూ సింగ్ మాత్రమే రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications