న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN:ఓయ్ కోహ్లీ.. ఓపెనింగ్ చేయడం టీ తాగినంత ఈజీ అనుకున్నావా? మండిపడుతున్న ఫ్యాన్స్!

IND vs BAN: Fans brutally troll Virat Kohli after dismissal in 2nd ODI against Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. తొలి వన్డేలో లిటన్ దాస్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగిన విరాట్.. రెండో వన్డేలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో ఓపెనర్‌గా అవతారమెత్తిన విరాట్ కోహ్లీ అంచనాలను అందుకోలేకపోయాడు.

వన్డే క్రికెట్‌లో 8 ఏళ్ల తర్వాత ఓపెనింగ్ చేసిన విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. 272 పరుగుల భారీ లక్ష్య చేధనలో శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ తొలి బంతినే బౌండరీకి తరలించి మంచి టచ్‌లో కనిపించాడు. కానీ ఎబాడట్ హోస్సేన్ వేసిన రెండో ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పుల్ షాట్ ఆడబోయి..

ఎబాడట్ వేసిన ఈ ఓవర్ ఐదో బంతిని షాట్ బాల్‌గా వేయగా.. విరాట్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమవ్వడంతో అది బ్యాట్ అంచుకు తగిలి వికెట్లను గీరాటేసింది. దాంతో ఎబాడట్ సంతోషానికి హద్దులు లేకుండా పోగా.. విరాట్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ వైఫల్యంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓపెనింగ్ చేయడం అంత సులువు అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తూ ట్రోలింగ్‌కు దిగారు.

టీ తాగినంత ఈజీ కాదు..

ఓపెనింగ్ చేయడం అంటే మూడో స్థానంలో వచ్చి నెమ్మదిగా ఆడుతూ సెంచరీలు చేసినట్లు కాదని, కొత్త బంతితో వచ్చే పేస్‌ను ఎదుర్కోవాలంటే క్వాలిటీ ఉండాలని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులే విరాట్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓపెనర్‌గా రోహిత్ శర్మకు పోటీలేరని, అది అతనికి మాత్రమే సాధ్యమంటున్నారు. ఓపెనింగ్ చేయడం టీ తాగినంత ఈజీ కాదని, ఓపెనర్‌గా ఎలా ఆడాలో రోహిత్‌ను చూసి నేర్చుకోవాలని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు విరాట్ ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. విరాట్ కాలి గోటికి కూడా రోహిత్ పనికిరాడని బదులిస్తున్నారు.

కష్టాల్లో టీమిండియా..

272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లీతో పాటు శిఖర్ ధావన్(9) కూడా త్వరగా ఔటవ్వడంతో వాషింగ్టన్ సుందర్‌ను అప్‌ది ఆర్డర్ ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం వికటించింది. అతను క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసినా షకీబ్ అల్ హసన్ దెబ్బ కొట్టాడు. దాంతో టీమిండియా 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(15 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(1 బ్యాటింగ్) ఉన్నారు.

మెహ్‌దీ హసన్ సెంచరీ..

ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. మెహ్‌దీ హసన్(83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) విరోచిత సెంచరీతో చెలరేగగా.. మహ్మదుల్లా(96 బంతుల్లో 7 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఈ జోడీ 148 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకుంది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Wednesday, December 7, 2022, 17:09 [IST]
Other articles published on Dec 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X