న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరగని ఘటన.. భర్త బౌలింగ్.. భార్య కీపింగ్!

In a rare occurrence in Cricket, wife keeps wickets for husband in ECS T10 tournament

స్విట్జర్లాండ్: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా గత మూడున్నర నెలలుగా క్రికెట్ టోర్నీలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ మహమ్మారి ప్రభావం నుంచి యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ పునరుద్దరణ చర్యలు ఊపందుకున్నాయి. ఇక గత సోమవారమే స్విట్జర్లాండ్ వేదికగా యూరోపియన్ క్రికెట్ సిరీస్(ఈసీఎస్) టీ10 లీగ్ ప్రారంభమై.. తుది దశకు కూడా చేరుకుంది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం ఒక్కరోజే సెమీఫైనల్, ఫైనల్‌తో కలిపి మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.

అత్యంత అరుదైన..

అయితే ఈ టోర్నీ తొలి సెమీస్ మ్యాచ్ సందర్భంగా అత్యంత అరుదైన ఘటన చోటుచేసుకుంది. అవును.. భర్త బౌలింగ్ చేస్తుండగా.. భార్య వికెట్ల వెనుకాల కీపింగ్ చేసింది. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కని విని ఎరగని సంఘటన ఇది అంటే అతిశయోక్తి కాదేమో. అందుకే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక వికెట్ల వెనుకాల కీపింగ్ చేసిన ప్లేయర్ ఎవరో కాదు.. ఈసీఎస్ టీ10 లీగ్ ఆడుతున్న తొలి మహిళగా రికార్డు సృష్టించిన శరణ్య సదరంగని. బౌలింగ్ చేసిన వ్యక్తి ఆమె భర్త ఫిన్ సదరంగని. ఈ ఇద్దరు కలిసి మ్యాచ్ ఆడటం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది.

ఇది రెండో సారి..

ఇది రెండో సారి..

కేఎస్‌వీ క్రికెట్ టీమ్ తరఫున బరిలోకి దిగిన ఈ ఇద్దరు.. పీఎస్‌వీ హాన్ ముండెన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కేఎస్‌వీ టీమ్ తరఫున జరిగిన 6 మ్యాచ్‌లు ఆడిన శరణ్య.. బ్యాటింగ్ చేసే అవకాశం రాకున్నా కీపింగ్‌లో అదరగొట్టింది. ఇక ఆఫ్ స్పిన్నర్ అయిన ఫిన్.. పీఎస్‌వీ హాన్ ముండెన్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 16 పరుగులిచ్చాడు. ఇక ఫిన్ బౌలింగ్ చేయగా.. శరణ్య కీపింగ్ చేయడం ఈ టోర్నీలో రెండో సారి. ఎస్‌సీ యూరోపాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన ఫిన్.. 9 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు. ఆ మ్యాచ్‌లో శరణ్యనే కీపర్.

5 వికెట్లతో గెలుపు..

5 వికెట్లతో గెలుపు..

ఇక పీఎస్‌వీ టీమ్‌తో జరిగిన సెమీఫైనల్లో కేఎస్‌వీ 5 వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పీఎస్‌వీ రెండు బంతులు మిగిలుండగానే 88 పరుగులకు కుప్పకూలింది. కేఎస్‌వీ బౌలర్లు తలో మూడు వికెట్లతో పీఎస్‌వీ టీమ్ పతనాన్ని శాసించారు. ఇక శరణ్య వికెట్ల వెనుకాల అద్భుత ప్రదర్శన కనబర్చింది. రెండు క్యాచ్‌లతో పాటు.. ఓ రనౌట్ చేసింది. ఇక లక్ష్య చేధనకు దిగిన కేఎస్‌వీ 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకొని 5 వికెట్లతో విజయం సాధించింది. ఫిన్.. 7 బంతుల్లో 6 పరుగులు చేశాడు.

సతీమణి సర్ నేమ్..

సతీమణి సర్ నేమ్..

మాములుగా అమ్మాయిలు పెళ్లైన తర్వాత తమ ఇంటి పేరును మార్చుకుంటారు. కానీ ఇక్కడ శరణ్య భర్త ఫిన్‌ను తన ఇంటిపేరును మార్చుకున్నాడు. తన సతీమణి ఇంటిపేరు సదరంగని పెట్టుకున్నాడు. భార్య పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. 2012లో శరణ్య కర్ణాటక అండర్-19 జట్టు తరఫున భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తితో కలిసి ఆడింది.

ధోనీ గొప్పతనం అప్పుడే అర్థమైంది: ఇషాంత్ శర్మ

Story first published: Friday, July 3, 2020, 16:33 [IST]
Other articles published on Jul 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X