నిజంగా నేర్చుకోవాలనుకుంటే.. నిన్నెవరూ ఆపలేరు: రిషబ్ పంత్

 If you’re determined to learn, no one can stop you, says Rishabh Pant ahead of the Boxing Day Test

మెల్‌బోర్న్‌: అండర్ 19 జట్టు నుంచి టీమిండియా వరకూ పృథ్వీ జరిగిన ప్రయాణం వేగంగా జరిగిపోయింది. అండర్ 19లో అదరగొట్టి ప్రఖ్యాత దేశీవాలీ లీగ్‌ ఐపీఎల్‌లో భారీ షాట్లతో మెరిపించాడు. ధోనీ వారసుడిగా ఖ్యాతిగాంచిన పంత్.. ఐపీఎల్‌లో 14 గేమ్‌లు ఆడి చివరిలో 684 పరుగులు సాధించి అధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత భారత్ ఏ జట్టు తరపున ఇంగ్లాండ్ గడ్డపై రాణించాడు. అదే సమయంలో టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై జట్టుకు తన అవసరముందని టెస్టు జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో ఆఖరి టెస్టులో సెంచరీని సిక్సుతో ముగించాడు. అనంతరం సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 84 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో టెస్టులోనూ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేయగలిగాడు.

అత్యధిక క్యాచ్‌లు అందుకున్న పంత్

అత్యధిక క్యాచ్‌లు అందుకున్న పంత్

ఈ యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా జట్టుకు దూరమవడం. ధోనీ ఫామ్ కోల్పోవడంతో కీపర్‌గా అవకాశం చేజిక్కుంచుకున్నాడు. దీంతో పంత్ అత్యధిక క్యాచ్‌లు అందుకున్న కీపర్‌గా రికార్డులకెక్కేశాడు. గతంలో భారత్ తరపున వృద్ధిమాన్ సాహా(10 క్యాచ్‌లు) పేరిట ఈ రికార్డు ఉండేది. అడిలైడ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పంత్ ఏకంగా 11 క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో టీమిండియాలో అధిక క్యాచ్‌లు అందుకున్న కీపర్‌గా రికార్డులకెక్కాడు.

ఫ్లాష్ బ్యాక్ 2018: క్రికెట్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసింది కోహ్లీనే!!

పెర్త్ నాలుగు 25, 28, 36, 30 ఇన్నింగ్స్‌లతో

కానీ, ఫార్మాట్‌కు తగ్గట్టుగా కాకుండా అంతే దూకుడుతో బ్యాటింగ్‌ చేస్తూ విఫలమైన పంత్‌.. పెర్త్ నాలుగు ఇన్నింగ్స్‌లో 25, 28, 36, 30 స్కోరుతో నిరాశ పరిచాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో బాగా రాణించాలని ఆశపడుతోన్న పంత్.. వేదాంతాన్ని జోడిస్తూ.. ఓ ట్వీట్ చేశాడు. 'నీకు నేర్చుకోవాలని లేకపోతే.. ఎవ్వరూ నీకు బోధించలేరు. కానీ, నువ్వు నేర్చుకోవాలనే కసితో సిద్ధమైతే నిన్నెవ్వరూ ఆపలేరు' అంటూ ట్వీట్ చేశాడు.

వన్డే జట్టులో చోటు కోల్పోయి.. టీ20లలో మాత్రమే

వన్డే జట్టులో చోటు కోల్పోయి.. టీ20లలో మాత్రమే

ధోనీకి ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైన పంత్‌పై వేటు పడింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లకు భారత వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలలో కేవలం 41పరుగులు మాత్రమే చేయగలిగాడు. టీ20లలో మాత్రం చోటు దక్కించుకోగలిగాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Story first published: Tuesday, December 25, 2018, 15:01 [IST]
    Other articles published on Dec 25, 2018