ఫ్లాష్ బ్యాక్ 2018: క్రికెట్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసింది కోహ్లీనే!!

హైదరాబాద్: సంవత్సరం ముగియనుంది. నూతన వసంతంలోకి అడుగుపెట్టే వేళైంది. జ్ఞాపకాలను మోసుకుని పోతూ.. నూతన ఉత్తేజంతో 2019లోకి అడుగుపెట్టే ముందు ఈ ఏడాది సాధించిన విజయాలను నెమరేసుకుంటే.. కోహ్లీనే ది బెస్ట్‌గా నిలిచాడు. పైగా ఈ ఏడాది మ్యాచ్‌ల మధ్యలో విరామాలు తీసుకుంటున్నప్పటికీ కొత్త పెళ్లి కొడుకులా ఏడాదిని ఆరంభించిన కోహ్లీ.. అరుదైన ఘనతలు సాధించాడు. సచిన్ కంటే వేగంగా పదివేల పరుగుల మైలురాయిని దాటి అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఇలా కోహ్లీతో పాటు ఈ ఏడాది మరిన్ని ఘనతలు సాధించిన క్రికెటర్ల గురించి విశ్లేషిస్తే..

టెస్టుల్లో కోహ్లీనే టాప్:
డిసెంబర్ 24 వరకు సంవత్సరాంతంలో క్రికెటర్లు సాధించిన పరుగులు పరిగణనలోకి తీసుకుంటే టెస్టుల్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2018 జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్ టెస్టు నుంచి ఇటీవల ముగిసిన పెర్త్ టెస్ట్ వరకు కోహ్లీ ఆడింది మొత్తంగా 12 మ్యాచ్‌లే. 56.36 సగటుతో 1240 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి పరుగులు సాధించిన ఏకైక టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. విరాట్ కంటే ఎక్కువగా 13 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 948 పరుగులతో రెండో స్థానం దక్కించుకున్నాడు.
ప్లాష్ బ్యాక్ 2018: సంపాదనలో టాప్-10 స్పోర్ట్స్ సెలబ్రిటీలు వీరే

తక్కువ వన్డేలు ఆడినా:
వన్డేల్లోనూ విరాట్‌దే పైచేయి. కేవలం 14వన్డేలు ఆడి 1202పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫిబ్రవరిలో డర్బన్‌లో జరిగిన వన్డే నుంచి నవంబర్‌లో తిరువనంతపురం వన్డే వరకు 133.55 సగటుతో కోహ్లీ ఈ పరుగులు సాధించాడు. వన్డేల్లో కోహ్లీతో పాటు మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్ వెయ్యి పరుగుల మార్కును అందుకున్నారు. వారిలో ఇద్దరు ఇంగ్లాండ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో (22 మ్యాచుల్లో 1025 పరుగులు), భారత ఓపెనర్ రోహిత్ శర్మ (19 మ్యాచుల్లో 1030 పరుగులు)లు ఉన్నారు.

టీ20లను శాసించిన గబ్బర్:
షార్ట్ ఫార్మాట్‌ను మాత్రం కోహ్లీకి బదులు ధావన్ శాసించాడు. 2018లో మొత్తం 18 మ్యాచ్‌లు ఆడిన ధావన్.. 40.52 సగటు, 147.22 స్ట్రైక్ రేట్‌తో 689 పరుగులు చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నా సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. అతడి అత్యధిక స్కోరు 92. ఫిబ్రవరిలో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టీ20 నుంచి నవంబర్‌లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ వరకు మొత్తం ఆరు హాఫ్ సెంచరీలతో ధావన్ విజృంభించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications