న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs SRH:ఈ మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతే!

 If SRH Looses With Punjab Kings Today Hyderabad Will Be Out Of IPL 2021

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ టీమ్‌కు ఈ సారి ఏది కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. అసలు ఆ ఫ్రాంచైజీ హిస్టరీలోనే ఇలా వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సందర్భాలు లేవు. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు గెలుపు ముంగిటనే చేతులెత్తేయడం గమనార్హం. మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం జట్టును చాలా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ ఆర్మీ.. మరోసమరానికి సిద్ధమవుతోంది. డబుల్ హెడర్‌లో భాగంగా (బుధవారం) నేడు మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

గెలవాలి లేకుంటే..

గెలవాలి లేకుంటే..

అయితే ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సన్‌రైజర్స్‌కు కోలుకోవడానికి ఈ మ్యాచే మంచి అవకాశం. పైగా పంజాబ్‌పై సన్‌రైజర్స్‌కు మెరుగైన రికార్డు ఉంది. అంతేకాకుండా చెన్నై పిచ్‌లో పంజాబ్‌కు ఇదే ఫస్ట్ మ్యాచ్. ఆ బలహీనతలపై దెబ్బకొడితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సులువుగా విజయం సాధించవచ్చు. అయితే ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఆ జట్టు మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొనుంది. ప్లే ఆఫ్స్ ఆశలు కూడా గల్లంతయ్యే చాన్స్ ఉంది.

బలమైన ప్రత్యర్థులు..

బలమైన ప్రత్యర్థులు..

ఐపీఎల్ ఫస్టాఫ్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు జరగనుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. తాజా మ్యాచ్ ఫలితం కూడా ప్రతికూలంగా వస్తే ఆ సంఖ్య నాలుగుకు చేరుతుంది. ఆ తర్వాతి మూడు మ్యాచ్‌లను వార్నర్ సేన.. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో పాటు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక రాజస్థాన్ మినహా.. మిగతా రెండు బలమైన జట్లు. రాజస్థాన్ కూడా ప్రస్తుతం మెరుగ్గానే ఉంది. కాబట్టి పంజాబ్‌తో మ్యాచ్‌ గెలవడం సన్‌రైజర్స్‌కు అత్యవసరం. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టుకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది. లేదంటే మరింత డీలా పడిపోతుంది. అప్పుడు ఢిల్లీ, చెన్నైని ఓడించడం కష్టమవుతుంది.

ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం..

ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం..

ఒక వేళ పంజాబ్‌తో పాటు మిగతా మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అవుతాయి. ఎందుకంటే సెకండాఫ్‌లో ఆ జట్టు ఏడింటికి కనీసం 6 అయినా గెలవాలి. అది ప్రస్తుత టీమ్‌తో అసాధ్యం. ఒకవేళ పంజాబ్‌తో ఓడి మిగతా మూడింటిలో రెండు గెలిచినా.. సెకండాఫ్‌లో కనీసం 5 మ్యాచ్‌లు గెలవాలి. ఇది కూడా కష్టమే అవుతుంది. ఎందుకంటే ఫస్టాఫ్‌లో 7 మ్యాచ్‌లకు 2 గెలిచిన జట్టు.. సెకండాఫ్‌లో ఏడింటిలో 5 గెలుస్తుందని చెప్పలేం. కాబట్టి ఫస్టాఫ్‌లో వీలైనన్ని మ్యాచ్‌లు గెలవడం ఏ జట్టుకైనా అవసరం.

 4 మ్యాచ్‌లు గెలవాల్సిందే..

4 మ్యాచ్‌లు గెలవాల్సిందే..

పంజాబ్‌తో పాటు తదుపరి ఢిల్లీ, చెన్నై, రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లను కూడా సన్‌రైజర్స్ గెలిస్తే సెకండాఫ్‌లో ఆ జట్టుపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. మరో మూడు, లేదా నాలుగు గెలిస్తే సులువుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. అలా కాకుండా మూడే గెలిచినా నెట్‌రన్ రెట్ కీలకం అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఓడిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ చాలా తక్కువ తేడాలో ఓడటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతానికి ఆ జట్టు రన్‌రేట్ మైనస్‌లో ఉన్నా.. విజయాలు బాట పట్టిన తర్వాత మెరుగ్గానే ఉంటుంది. మరి సన్‌రైజర్స్ ఏం చేస్తుందో చూడాలి.

Story first published: Wednesday, April 21, 2021, 13:15 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X