న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌: టాప్‌లో భారత్.. మూడో స్థానంలో ఇంగ్లండ్!!

ICC World Test Championship Updated Points Table After Eng vs Pak: England Get Closer to Australia

దుబాయ్: ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఐసీసీ తాజాగా వెల్లడించిన టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో ఎప్పటిలానే భారత్ టాప్‌లో కొనసాగుతోంది. 360 పాయింట్లు భారత్ ఖాతాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా 296 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలిచిన ఇంగ్లండ్.. 292 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా కంటే ఇంగ్లండ్ నాలుగు పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది.

 న్యూజిలాండ్@4:

న్యూజిలాండ్@4:

ఐసీసీ తాజా పట్టికలో న్యూజిలాండ్ 180 పాయింట్లతో నాలుగులో ఉంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌‌లో తేలిపోయిన పాకిస్థాన్ 166 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ ఒక మ్యాచ్‌లో ఓడి.. రెండింటిని డ్రాతో సరిపెట్టుకుంది. ఇక శ్రీలంక (80), వెస్టిండీస్ (40), దక్షిణాఫ్రికా (24), బంగ్లాదేశ్ (0)లు టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో వరుసగా ఉన్నాయి. ఛాంపియన్‌షిప్‌లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ రూపంలో మొత్తం తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి.

27 సిరీస్‌ల్లో 71 టెస్టులు:

27 సిరీస్‌ల్లో 71 టెస్టులు:

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ప్రతి క్రికెట్ జట్టు సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. 2019, ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ని ఐసీసీ ప్రారంభించింది. రెండేళ్ల ఈ ఛాంపియన్‌షిప్‌లో చివరగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్‌ నెలలో ఫైనల్ జరగనుంది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా నిలవనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ వచ్చినప్పటినుండి ప్రతి టీమ్ ఫైనల్ చేరాలని చూస్తున్నాయి.

 టెస్టుల సంఖ్య ఆధారంగా పాయింట్లు:

టెస్టుల సంఖ్య ఆధారంగా పాయింట్లు:

సిరీస్‌లోని టెస్టుల సంఖ్య ఆధారంగా ఛాంపియన్‌షిప్ పాయింట్లను విభజిస్తారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో గరిష్టంగా ఐదు టెస్టులు మాత్రమే ఆడాలి. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే.. మ్యాచ్‌లో విజేతకు 60 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ అయితే.. మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40 పాయింట్లు కేటాయిస్తారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే మ్యాచ్‌ నెగ్గిన జట్టుకు 30 పాయింట్లు కేటాయిస్తారు. ఐదు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌ జరిగితే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 24 పాయింట్లగా నిర్ణయించారు.

CPL 2020: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నైట్ రైడర్స్.. భారత ఆటగాడికి అవకాశం!!

Story first published: Wednesday, August 26, 2020, 20:55 [IST]
Other articles published on Aug 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X