For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నైట్ రైడర్స్.. భారత ఆటగాడికి అవకాశం!!

CPL 2020: Trinbago Knight Riders have won the toss and have opted to field

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్‌): వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 సీజన్లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం నైట్ రైడర్స్ రెండు మార్పులు చేసింది. జేడెన్ సీల్స్ స్థానంలో టీమిండియా వెటరన్ ఆటగాడు ప్రవీణ్ తాంబే ఆడనున్నాడు. మరోవైపు సెయింట్ లూసియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. విండీస్ బాహుబలి రాకీమ్ కార్న్‌వాల్ జట్టులోకి వచ్చాడు.

నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ మాట్లాడుతూ... 'మేము మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాం. వికెట్ మీద తేమ ఉంది కాబట్టి మేం దాన్ని ఉపయోగించుకోవాలి. స్పిన్‌కు సహాయపడుతుంది. అందుకే అదనపు స్పిన్నర్ను తీసుకున్నాం. ఈ మ్యాచ్ కోసం కొన్ని మార్పులు చేశాం. జేడెన్ సీల్స్ కోసం ప్రవీణ్ తాంబేకు అవకాశం ఇచ్చాము. సునీల్ నరైన్ మ్యాచ్ ఆడట్లేదు' అని తెలిపాడు. 'నైట్ రైడర్స్ బాగా ఆడుతుంది. మేము కూడా ఆడుతాం. పిచ్ తడిగా ఉంది కాబట్టి ప్రారంభంలో బౌలర్లకు కొంత సహాయం ఉండవచ్చు. టాస్ అనేది మన చేతుల్లో లేదు. మేం మొదట బ్యాటింగ్ చేయాలి చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఆడాలి' అని సెయింట్ లూసియా సారథి డారెన్ సామీ అన్నాడు.

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ 2020 సీజన్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఆడిన మూడు మ్యాచులలో విజయం సాధించి మంచి ఊపులో ఉంది. మున్రో, బ్రావో, పోలార్డ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు సెయింట్ లూసియా జూక్స్ ఆడిన నాలుగు మ్యాచులలో మూడు విజయాలు అందుకుంది. సెయింట్ లూసియా తరఫున ఫ్లెచర్, ఛేజ్, నబీ, సామీ అద్భుతంగా ఆడుతున్నారు. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

Teams (Playing XI):

St Lucia Zouks (Playing XI): Andre Fletcher(w), Rahkeem Cornwall, Mark Deyal, Roston Chase, Najibullah Zadran, Mohammad Nabi, Javelle Glenn, Daren Sammy(c), Scott Kuggeleijn, Kesrick Williams, Chemar Holder.

Trinbago Knight Riders: Lendl Simmons, Tion Webster, Colin Munro, Darren Bravo, Kieron Pollard(c), Tim Seifert(w), Dwayne Bravo, Khary Pierre, Ali Khan, Fawad Ahmed, Pravin Tambe.

Story first published: Wednesday, August 26, 2020, 19:50 [IST]
Other articles published on Aug 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+