న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Men's T20I Team of the Year 2022: భారత్ నుంచి ముగ్గురే.. రోహిత్‌కు దక్కని చోటు!

ICC Mens T20I Team of the Year 2022: Virat Kohli among 3 Indians named, No chance for Rohit

దుబాయ్: గతేడాది టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బెస్ట్ ఎలెవన్‌ను ఎంపిక చేసింది. 2022లో బ్యాట్, బంతితో పాటు ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన బెస్ట్ ప్లేయర్లకు ఈ టీమ్‌లో అవకాశం ఇచ్చింది. భారత్ నుంచి మొత్తం ముగ్గురు ఆటగాళ్లు ఈ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నారు.

విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఎంపికవ్వగా.. రన్నరప్ పాకిస్థాన్ నుంచి కూడా ఇద్దరు ప్లేయర్లు ఎంపికయ్యారు. శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్‌ల నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. గతేడాది దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు.

విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ..

భారత్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆసియాకప్‌ 2022తో పాటు టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ పరుగుల మోత మోగించిన విషయం తెలిసిందే.

ఆసియాకప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 276 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. సెంచరీల నిరీక్షణకు కూడా తెరదించాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 82 నాటౌట్‌తో అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. మొత్తం 296 పరుగులతో హయ్యెస్ట్ రన్నర్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి.

సూర్యకుమార్ యాదవ్..

సూర్యకుమార్ యాదవ్..

గతేడాది టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నెంబర్ టీ20 బ్యాటర్‌గా నిలిచాడు. అసాధారణ బ్యాటింగ్‌తో ఒకే క్యాలండర్ ఇయర్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 1164 రన్స్‌తో గతేడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

ఇందులో 2 సెంచరీలతో పాటు 9 హాఫ్ సెంచరీలున్నాయి. స్ట్రైక్‌రేట్ 187.43గా ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్య సత్తా చాటాడు. 189.68 స్ట్రైక్‌రేట్‌తో 239 రన్స్ చేశాడు.

హార్దిక్ పాండ్యా..

హార్దిక్ పాండ్యా..

పూర్తి ఫిట్‌నెస్ సాధించి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా దుమ్మురేపాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటాడు. గతేడాది 607 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌కు మరో ఎండ్‌లో పాండ్యానే సహకారం అందించాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 33 బంతుల్లో 63 పరుగులు చేసాడు. కానీ భారత్‌కు అనుకూల ఫలితం దక్కలేదు.

టీమ్ కాంబినేషన్ ఏంటంటే..?

టీమ్ కాంబినేషన్ ఏంటంటే..?

అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఎంపిక చేసిన జట్టులో ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కెప్టెన్ కమన్ ఓపెనర్, వికెట్‌కీపర్‌గా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరో ఓపెనర్‌గా పాక్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ ఎంపికవ్వగా..3, 4 స్థానాలను కోహ్లీ, సూర్య కైవసం చేసుకున్నారు.

న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్ ఐదో స్థానంలో ఎంపికవ్వగా.. జింబాబ్వే స్పిన్ ఆల్‌రౌండర్ సికిందర్ రాజా.. ఆరో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా, 8వ స్థానంలో సామ్ కరణ్ పేస్ ఆల్‌‌రౌండర్లుగా ఎంపికయ్యారు. 9వ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా.. హరీస్ రౌఫ్(పాక్), జోష్ లిటిల్(ఐర్లాండ్)‌లు ప్రధాన పేసర్లుగా చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ 2022 అత్యుత్తమ టీ20 టీమ్

ఐసీసీ 2022 అత్యుత్తమ టీ20 టీమ్

జోస్ బట్లర్(కీపర్, కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గ్లేన్ ఫిలిప్స్, సికిందర్ రాజా, హార్దిక్ పాండ్యా, సామ్ కరన్, వానిందు హసరంగా, హరీస్ రౌఫ్, జోష్ లిటిల్

Story first published: Monday, January 23, 2023, 17:31 [IST]
Other articles published on Jan 23, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X