న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు ఆసీస్ గడ్డపై ఇదే సరైన సమయం: ధావన్

India Vs Australia 2018 : Shikhar Dhawan Says On Test Snub 'I Was A Bit Sad But Have Moved On'
I was a bit sad but have moved on, says Shikhar Dhawan on Test snub

హైదరాబాద్: 2013వ సంవత్సరం వీరేందర్ సెహ్వాగ్ స్థానంలో టెస్టు ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన శిఖర్ ధావన్ అదే స్థాయిలో ఆడి ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. టెస్టుల్లో ధావన్ ఫామ్ కేవలం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆ క్రమేపీ టెస్టు క్రికెట్‌లో ఫామ్‌ను క్రమంగా కోల్పోతూ వచ్చాడు. అరంగ్రేట మ్యాచ్‌లోనే 85 బంతులకి సెంచరీ పూర్తి చేసిన ధావన్.. ఒకే ఇన్నింగ్స్‌లో 187బంతుకి 174 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి భారత సెలక్టర్లు ఎంపిక

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి భారత సెలక్టర్లు ఎంపిక

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు భారత్ జట్టుకి ఇదే మంచి అవకాశమని ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో నిరాశపరిచిన శిఖర్ ధావన్‌ను ఆ తర్వాత వెస్టిండీస్, తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి భారత సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇంగ్లాండ్‌తో 4 టెస్టుల్లో అవకాశం దక్కించుకున్న శిఖర్ ధావన్ 8 ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన పరుగులు 162 మాత్రమే.

ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా ప్రాక్టీస్‌కు అవాంతరంగా వర్షం

ధావన్‌తో పాటు పేలవ ఫామ్‌ కారణంగా

ధావన్‌తో పాటు పేలవ ఫామ్‌ కారణంగా

అయితే.. ధావన్‌తో పాటు పేలవ ఫామ్‌ కారణంగా ఇంగ్లాండ్ పర్యటనలో వేటుకి గురైన మురళీ విజయ్‌ని మాత్రం ఆసీస్ పర్యటనకి సెలక్టర్లు ఎంపిక వేయడటెస్టు జట్టులో స్థానం కోల్పోవడంపై తాజాగా శిఖర్ ధావన్ మాట్లాడాడు.

జట్టులో చోటు దక్కలేదని బాధగా

జట్టులో చోటు దక్కలేదని బాధగా

‘టెస్టు జట్టులో చోటు దక్కనందుకు బాధగా ఉంది. కానీ.. కెరీర్‌లో ఇలాంటి చేదు అనుభవాల్ని దాటుకుంటూ ముందుకు వెళ్లక తప్పదు. ప్రస్తుతానికి నా ఆటని ఎంజాయ్ చేస్తున్నా. మ్యాచ్‌లు లేని సమయంలో.. కుటుంబంతో గడుపుతున్నా. ఇలా హ్యాపీ మూడ్‌లో ఉన్నప్పుడు.. అన్నీ మంచే జరుగుతాయని నా నమ్మకం. ఇక ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కి ఇదే మంచి అవకాశం. ' అని శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు.

పెద్ద కష్టమేమీ కాదు

పెద్ద కష్టమేమీ కాదు

ఆడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. గత కొంతకాలంగా టీమిండియా అత్యుత్తమ క్రికెట్ ఆడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ మెరుగ్గా రాణిస్తోంది. ఆసీస్‌పైనా ఇదే నిలకడని ప్రదర్శిస్తే.. సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.

Story first published: Wednesday, November 28, 2018, 14:43 [IST]
Other articles published on Nov 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X