న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా బౌలింగ్‌ వల్ల నిద్ర పట్డేది కాదు.. మధ్య రాత్రి ఉలిక్కిపడేవాడిని: ఆసీస్ బ్యాట్స్‌మన్

‘I used to wake up in the middle of the night’ Aaron Finch reveals his struggles against Jasprit Bumrah

మెల్‌బోర్న్: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా ధాటికి ఓ టెస్ట్ సిరీస్‌లో తనకు నిద్రకూడా పట్టలేదని, అతని బౌలింగ్‌లో మళ్లీ ఔటయ్యనేమోనని అర్థ రాత్రులు ఉలిక్కిపడేవాడినని ఆస్ట్రేలియా ఓపెనర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు.

బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత..

బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత..

బుమ్రా ధాటికి 2018 బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత ఈ స్టార్ ఓపెనర్ మళ్లీ సంప్రదాయక క్రికెట్ ఆడలేదు. భారత్‌తో జరిగిన ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌‌లో ఫించ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గెలిచిన తొలి టెస్ట్ సిరీస్ కూడా ఇదే.

సింహ స్వప్నంలా..

సింహ స్వప్నంలా..

ఈ సిరీస్ విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫించ్‌కు సింహా స్వప్నంలా మారాడు. బుమ్రా బౌలింగ్‌లోనే ఫించ్ రెండు సార్లు ఔటయ్యాడు. ఇక అతను ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 97 పరుగులు చేశాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఈ ఆసీస్ ఓపెనర్.. క్రికెట్ కెరీర్‌పైనే గందరగోళం నెలకొంది. అయితే వన్డే వరల్డ్‌కప్‌లో విధ్వంకర బ్యాటింగ్‌తో ఫించ్ మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు.

ఒకప్పుడు కోహ్లీ నా దగ్గర సలహాలు తీసుకున్నాడు.. కానీ ఇప్పుడు

అమెజాన్ ప్రైమ్ డాక్యుమెంటరీ..

అమెజాన్ ప్రైమ్ డాక్యుమెంటరీ..

తాజాగా ఆస్ట్రేలియా జట్టుపై అమెజాన్ ప్రైమ్ రూపొందించిన డాక్యుమెంటరీలో బుమ్రా బౌలింగ్‌లో ఎదుర్కొన్న సమస్యలను ఫించ్ చెప్పుకొచ్చాడు. ఈ డాక్యుమెంటరీలో 2018 బాల్ టాంపరింగ్ వివాదం, 2001 నుంచి ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ సిరీస్‌ను ఎలా కాపాడుకుందనే విషయాన్ని ప్రధానంగా తెరకెక్కించారు.

అది గడ్డుకాలం..

అది గడ్డుకాలం..

భారత్‌తో జరిగిన టెస్ట్‌సిరీస్‌లో తనకు నిద్ర కూడా పట్టేది కాదని ఫించ్ ఈ డాక్యుమెంటరీలో తెలిపాడు. మళ్లీ బుమ్రా ఔట్ చేసినట్లు పదేపదే ఊహించుకునేవాడినన్నాడు. ‘బుమ్రా మళ్లీ ఔట్ చేశాడేమోనని తలుచుకొని అర్థరాత్రులు ఉలిక్కిపడేవాడిని. ఆ సిరీస్ ఆసాంతం నాకు చాలా కష్టంగా గడిచింది.‘ అని ఫించ్ తెలిపాడు.

Story first published: Friday, March 13, 2020, 14:50 [IST]
Other articles published on Mar 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X