న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకప్పుడు కోహ్లీ నా దగ్గర సలహాలు తీసుకున్నాడు.. కానీ ఇప్పుడు

Kevin Pietersen reveals interesting Virat Kohli anecdote
Kevin Pietersen Reveals Interesting Facts About Virat Kohli | Oneindia Telugu

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకప్పుడు తన దగ్గర సలహాలు తీసుకున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ గుర్తుచేసుకున్నాడు. 2009 ఐపీఎల్ సీజన్‌లో పీటర్సన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అప్పడు టీమ్‌లో కోహ్లీ యువ ప్లేయర్‌గా ఉన్నాడు. ఆ సీజన్ నాటి రోజులను పీటర్సన్ ఓ ఇంటర్వ్యూలో తాజాగా నేమరువేసుకున్నాడు.

అస్సలు ఊహించలేదు..

అస్సలు ఊహించలేదు..

తన దగ్గర సలహాలు తీసుకున్న కోహ్లీ ఇంత గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని తాను అస్సలు ఊహించలేదన్నాడు. '2009 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించా. మ్యాచ్‌లు ఆడడానికి బస్సులో వెళ్లే సమయంలో, అలాగే ప్రాక్టీస్‌ సమయంలోనూ నా దగ్గర కోహ్లీ బ్యాటింగ్‌ సలహాలు తీసుకునేవాడు. ఆ సమయంలో అతను ఆటను నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఒక ఉత్తమ ఆటగానిగా తయారవ్వాలనే సంకల్పమే కోహ్లీని ఈరోజు ఈ స్థాయికి చేర్చింది. అతను ఇంత గొప్ప క్రికెటర్ అవుతాడని ఆ రోజుల్లో అస్సలు ఊహించలేదు'అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.

రనౌట్ చేశాడు..

రనౌట్ చేశాడు..

ఆ ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌‌‌లో కోహ్లీ తనను రనౌట్ చేశాడని ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గుర్తు చేసుకున్నాడు. ‘ఆ మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి నన్ను రనౌట్‌ చేశాడు. కానీ నేను ఏమి అనకుండా మైదానంలో అతన్ని స్వేచ్చగా వదిలేసాను. ఒక యువ ఆటగాడిగా జట్టును గెలిపించాలనే భావంతో మ్యాచ్‌ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. తన కంటే సీనియర్‌ ఆటగాడినైనా ఆ సమయంలో అతన్ని ఏమి అనలేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను.. అప్పట్లో కోహ్లిని ఒక యంగ్‌ ప్లేయర్‌గా చూస్తూనే అతని కెరీర్‌ ఆరంభంలో నా వంతుగా సలహాలు, సూచనలు చేశాను. ఇప్పటికి మా మధ్య మంచి స్నేహం ఉందనుకుంటున్నా' అని ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ తెలిపాడు.

ఆరంభం నుంచి ఆర్సీబీనే

ఆరంభం నుంచి ఆర్సీబీనే

ఆరంభ ఐపీఎల్ సీజన్‌ను కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్నాడు. 2011 నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యదిక పరుగులు చేసిన రికార్డుతో పాటు ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. మొదటి స్థానంలో ఆరు సెంచరీలతో విండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ కొనసాగుతున్నాడు. ఇక కరోనా ప్రభావంతో ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహణపై గందరగోళం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఖాళీ మైదానాల్లో నిర్వహించాలా? లేక వాయిదా వేయాలా?అనే విషయం బీసీసీఐ తేల్చుకోలేకపోతుంది. ఇక శనివారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఫ్రాంచైజీల ఓనర్లను కూడా ఆహ్వానించారు.

Story first published: Friday, March 13, 2020, 12:32 [IST]
Other articles published on Mar 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X