న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నోట్లో గులాబ్‌జామ్‌లు పెట్టుకొని ఎలా మాట్లాడుతున్నావ్.. రోహిత్ బుగ్గలపై యువీ సెటైర్!

Yuvraj Singh funnily replies to Rohit Sharma’s post
Yuvraj Singh Defends Rishabh Pant, Slams Virat Kohli-Led Team Management

న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ తాజాగా ప్రకటించిన క్రీడా అవార్డుల్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను అత్యున్నత పురస్కారం ఖేల్‌రత్న వరించిన విషయం తెలిసిందే. దేశ క్రీడాచరిత్రలోనే తొలిసారిగా రోహిత్‌తో పాటు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) సంచలనం మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌‌లతో మొత్తం ఐదుగురు ఈ అత్యున్నత పురస్కారం దక్కించుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 27న వర్ఛువల్‌గా ఈ అవార్డులను అందజేయనున్నారు.

క్రికెట్‌లో ఈ అవార్డు అందుకున్న నాలుగో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతని కన్నా ముందు సచిన్‌ టెండూల్కర్‌ (1998), ఎంఎస్ ధోనీ (2007), విరాట్‌ కోహ్లీలకు (2018) ఈ క్రీడా అత్యున్నత పురస్కారం దక్కింది. అయితే ఈ ముగ్గురు సారథులుగా ఉన్నప్పుడు ఈ అవార్డు రాగా.. రోహిత్‌కు మాత్రం ఆటగాడిగానే ఈ పురస్కారం దక్కింది. దీంతో పూర్తిస్థాయి కెప్టెన్సీ చేపట్టకుండానే ఈ ఖేల్‌రత్నను సాధించిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్ ప్రత్యేకత గుర్తింపు సాధించాడు.

Yuvraj Singh funnily replies to Rohit Sharma’s post

ఇక అత్యున్నత పురస్కారం అందుకున్న రోహిత్‌కు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్‌లతో పాటు సహచర ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సురేశ్ రైనాలు అభినందనలు తెలిపారు. వీరందరికి ధన్యవాదాలు తెలుపుతూ హిట్ మ్యాన్ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు. తనకు విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ముంబైకర్.. అభిమానుల ప్రోత్సాహంతోనే ఇది దక్కిందన్నాడు. ఈ అవార్డు వారికే అంకితమని ప్రకటించాడు.

అయితే ఈ వీడియోలోని రోహిత్ బుగ్గలపై యువీ సెటైర్ వేశాడు. 'నోట్లో ఇరువైపుల గులాబ్ జామ్‌లు పెట్టుకొని ఎలా మాట్లాడుతున్నావ్.. నిజంగా ఇది అద్భుతం'అని రోహిత్ సతీమణి రితికా సజ్దేకు ట్యాగ్ చేశాడు.

దీనిపై ఫన్నీగా స్పందించిన రితికా.. 'యువీ.. నువ్వు ఖచ్చితంగా ఖేల్ రత్న అవార్డు గ్రహితను టీజ్ చేయాలి'అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు కామెంట్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ కోసం సతీమణి రితికా, కూతురు సమైరాతో దుబాయ్‌కు వెళ్లిన రోహిత్.. మైదానంలో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

ధోనీ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరు బాలేదు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ధోనీ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరు బాలేదు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

View this post on Instagram

Thank you for all your wishes and lots of love.

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

Story first published: Sunday, August 23, 2020, 17:39 [IST]
Other articles published on Aug 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X