న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా-బి టీమ్‌కు గట్టి పోటీ.. రేసులో పాతిక మంది ప్లేయర్లు.. సెలెక్టర్లకు బిగ్ టాస్క్!

Healthy headache for BCCI selectors ahead of India B team Tour of Sri Lanka

హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో భారత అభిమానులకు డబుల్ కిక్‌‌‌‌ లభించనుంది. ఓవైపు విరాట్‌‌‌‌ కోహ్లీ కెప్టెన్సీలోని టెస్టు టీమ్.. వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌ ఫైనల్‌‌ తర్వాత, ఇంగ్లండ్‌‌‌‌తో సిరీస్‌‌‌‌ కోసం ప్రిపరేషన్స్‌‌‌‌ కొనసాగిస్తుండగా.. మరోవైపు ఓ కొత్త కెప్టెన్‌‌‌‌ సారథ్యంలోని ఇండియా బీ‌‌‌ టీమ్‌‌‌‌.. శ్రీలంకలో వన్డే, టీ20ల్లో బరిలోకి దిగనుంది. 20 మంది ప్రధాన‌‌‌, నలుగురు స్టాండ్‌‌‌‌బై ప్లేయర్లు ఇంగ్లండ్‌‌‌‌ గడ్డపై ఉండగానే.. లంక సిరీస్‌‌‌‌ కోసం ఓ పాతిక మంది వెయిటింగ్‌‌‌‌లో ఉన్నారు.

గతంలో నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఆడే అర్హత, సత్తా ఉన్న ప్లేయర్లను వెతుక్కున్న సందర్భాలను అధిగమించి.. ఒకే టైమ్‌‌‌‌లో రెండు జట్లను బరిలోకి దింపే స్థాయికి మన వనరులు పెరిగాయి. డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌, ఐపీఎల్‌‌‌‌తో వెలుగులోకి వచ్చిన ఎంతో మంది యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌.. ఇప్పుడు ఇండియా-బి టీమ్‌‌‌‌ కోసం పోటీపడుతున్నారు. దీంతో టీమ్‌‌‌‌లో ఉండే అన్ని ప్లేస్‌‌‌‌లకు విపరీతమైన ఆప్షన్స్‌‌‌‌ అందుబాటులోకి రావడంతో సెలెక్టర్లకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

బ్యాటింగ్‌‌‌ ఆప్షన్స్‌‌..

బ్యాటింగ్‌‌‌ ఆప్షన్స్‌‌..

‌‌శిఖర్​ ధావన్‌‌‌‌, పృథ్వీ షా, సంజు శాంసన్‌‌‌‌, సూర్యకుమార్​యాదవ్, దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌, రుతురాజ్​ గైక్వాడ్‌‌‌‌, మనీశ్​ పాండే, ఇషాన్​ కిషన్‌లు ఇండియా బి టీమ్ టాపార్డర్ కోసం పోటీపడుతున్నారు.

ధావన్, పృథ్వీ తప్పితే మిగతా టాపార్డర్​ బ్యాట్స్‌‌‌‌మెన్​ మిడిలార్డర్​లో కూడా ఫిట్​అవుతారు. అయితే ఓపెనింగ్​ స్లాట్స్​కోసం సెలెక్టర్ల ముందు చాలా ఆప్షన్స్​ఉన్నాయి. కోహ్లీ, రోహిత్​ శర్మ లేని టైమ్‌‌‌‌లో శిఖర్ బ్యాటింగ్‌‌‌‌లో కీలకం కానున్నాడు. ఐసీసీ ఈవెంట్లలో అదరగొట్టే ఈ ఢిల్లీ డాన్‌‌‌‌.. గత మూడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ ఓపెనర్​గా ఐపీఎల్​లో సత్తా చాటుతున్నాడు. అతని ఓపెనింగ్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌గా షా, పడిక్కల్​పోటీ పడుతున్నారు. లాస్ట్ ఐపీఎల్‌‌‌‌తో పాటు ఆసీస్​టూర్‌‌‌‌లో చెత్తాటతో ఇండియా టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌లో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈ ఐపీఎల్‌‌‌‌తో మళ్లీ ఫుల్​ ఫామ్​లోకి వచ్చాడు.

దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ కూడా ఐపీఎల్‌తో సెంచరీతో చెలరేగాడు. సూర్యకుమార్, ఇషాన్​, శాంసన్‌‌‌‌, సీనియర్​ మనీశ్​ పాండేతో మిడిలార్డర్​లో ఎలాంటి సమస్య లేదు. శాంసన్, కిషన్‌‌‌‌ ఇద్దరూ వికెట్‌‌‌‌ కీపర్లుగా పనికొస్తారు.

బౌలింగ్ ఆప్షన్స్..

బౌలింగ్ ఆప్షన్స్..

భువనేశ్వర్​ కుమార్, నవదీప్​ సైనీ, దీపక్‌‌‌‌ చహర్, జైదేవ్​ ఉనాద్కట్, ఖలీల్​ అహ్మద్​, హర్షల్​ పటేల్, చేతన్ సకారియాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.గాయం, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సమస్యలు లేకపోతే.. లంక టూర్​లో ఇండియా బౌలింగ్‌‌‌‌ను సీనియర్ పేసర్​ భువనేశ్వర్​ కుమార్ నడిపించనున్నాడు. దీపక్‌‌‌‌ చహర్, నవదీప్‌‌‌‌ సైనీకి కూడా చోటు గ్యారంటీ. ఆర్‌‌‌‌సీబీ టీమ్‌‌‌‌లో సూపర్​ ఫామ్​లో ఉన్న సిరాజ్ కారణంగా ఐపీఎల్‌‌‌‌లో ఎక్కువ చాన్స్​లు రాకపోయినా సైనీలో వన్డేలకు పనికొచ్చే మంచి పేస్‌‌‌‌, స్కిల్స్​ఉన్నాయి.

టీ20ల మాదిరిగా పవర్​ప్లేలో బౌలింగ్‌‌‌‌ బాధ్యతను దీపక్‌‌‌‌ పంచుకోగలడు. మోకాలికి సర్జరీతో నటరాజన్‌‌‌‌ టీమ్‌‌‌‌కు దూరం కాగా, లెఫ్టార్మ్​ ​ పేసర్ గా ఖలీల్‌‌‌‌ అహ్మద్, జైదేవ్​లో​ఒకరిని సెలెక్టర్లు ఎంచుకోవచ్చు. గత రంజీ సీజన్‌‌‌‌లో రికార్డు స్థాయిలో 67 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన జైదేవ్​ వైపు మొగ్గుంది. ఐపీఎల్‌‌‌‌ -14లో అదరగొట్టిన ఇద్దరు యువ పేసర్లు హర్షల్​పటేల్, చేతన్ సకారియాలో ఒకరిని వైల్డ్‌‌‌‌ కార్డ్‌‌‌‌ ఎంట్రీగా టీమ్‌‌‌‌లోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదు.

స్పిన్నర్లు..

స్పిన్నర్లు..

యుజ్వేంద్ర చహల్, కుల్దీప్‌‌‌‌ యాదవ్, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తిలు మధ్య పోటీ ఉంది. చహల్, కుల్దీప్‌‌‌‌ ఫామ్​ కోల్పోవడంతో గత రెండేళ్లుగా వైట్‌‌‌‌బాల్​క్రికెట్‌‌‌‌లో ఇండియా స్పిన్ డిపార్ట్​మెంట్‌‌‌‌ వీక్‌‌‌‌గా మారింది. ఇది 2019 వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో టీమ్‌‌‌‌ అవకాశాలను దెబ్బకొట్టింది. ఓవైపు కుల్దీప్ నేషనల్ టీమ్‌‌‌‌తో పాటు ఐపీఎల్‌‌‌‌ కేకేఆర్​తరఫున అరుదుగా ఆడగా, చహల్‌‌‌‌లో నిలకడ లోపించింది. అతని బాల్స్‌‌‌‌ ఈజీగా అర్థం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు రాహుల్ చహర్​, మిస్టరీ స్పిన్నర్​ వరుణ్​ చక్రవర్తి వైపు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. కృనాల్‌‌‌‌ పాండ్యాతో పాటు తను సెకండ్ ఆఫ్​ స్పిన్నర్​ ఆప్షన్​గా పని కొస్తాడు. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌, భుజం గాయం నేపథ్యంలో వరుణ్‌‌‌‌ను టీ20లకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చు.

ఆల్‌‌‌‌రౌండర్స్​ ఎవరంటే..?

ఆల్‌‌‌‌రౌండర్స్​ ఎవరంటే..?

ఆల్‌‌‌‌రౌండర్ల ఎంపికే సెలెక్టర్లకు కాస్త సవాల్ కానుంది. ఎందుకంటే హార్దిక్​ పాండ్యా బౌలింగ్ చేయగలడా? అన్‌‌‌‌క్యాప్డ్‌‌‌‌ లెగ్‌‌‌‌ స్పిన్ ఆల్‌‌‌‌రౌండర్​ రాహుల్‌‌‌‌ తెవాటియా బిగ్గెస్ట్‌‌‌‌ స్టేజ్‌‌‌‌కు పనికొస్తాడా? లేదంటే శివం దూబే, విజయ్‌‌‌‌ శంకర్​లకు మరో చాన్స్‌‌‌‌ ఇవ్వాలా? అనే ప్రశ్నలకు సమాధానం వెతకాలి. ప్రస్తుతానికి రవీంద్ర జడేజా, హార్దిక్ రూపంలో మన టీమ్‌‌‌‌కు ఇద్దరు బెస్ట్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్లు ఉన్నారు.

వీళ్లు టీ20 వరల్డ్​కప్​లో ఆడడం కూడా ఖాయమే. అయితే శ్రీలంక సిరీస్‌‌‌‌ ద్వారా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టీమ్‌‌‌‌కు మరికొన్ని ఆప్షన్లు పెరిగే అవకాశం ఉంది. బౌలింగ్ చేసినా? చేయకున్నా హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు ఖాయం.

Story first published: Thursday, May 13, 2021, 16:28 [IST]
Other articles published on May 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X