న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Harsha Bhogle Playing 11 T20 Team For 2021: కోహ్లీ, రోహిత్‌కు నో చాన్స్! భారత్ నుంచి ఒక్కడే!

Harsha Bhogle Picks Playing 11 T20 For 2021: Virat Kohli And Rohit Sharma Out Of the Team

న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే 2021లో టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో బెస్ట్ ఎలెవన్ టీమ్‌ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో భారత్ నుంచి ఒకే ఒక్కడు చోటు దక్కించుకున్నాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మకూ చోటు దక్కలేదు. టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను మాత్రం రిజర్వ్ బెంచ్ ఆటగాడిగా ఎంపిక చేశాడు.

యార్కర్ల కింగ్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టీమిండియా తక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడటం.. కొన్ని మ్యాచ్‌లు బీ టీమ్ ఆడటంతో భారత ఆటగాళ్లకు అవకాశం దక్కలేదు. టీ20 ప్రపంచకప్‌లో కూడా లీగ్ దశలోనే ఇంటి దారి పట్టడం కూడా భారత ఆటగాళ్లకు ప్రాధాన్యత లేకుండా పోయింది.

పాక్ ఓపెనర్‌తో..

పాక్ ఓపెనర్‌తో..

టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను ఓపెనర్లుగా ఎంపిక చేసిన హర్షాభోగ్లే.. ఫస్ట్ డౌన్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్‌కు అవకాశం ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకే హర్ష ప్రాధాన్యత ఇచ్చాడు. ఐపీఎల్, బీబీఎల్, పీఎస్‌ఎల్ లీగ్ పెర్ఫామెన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకున్నాడు. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ఐదో స్థానంలో గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకున్నాడు. ఐపీఎల్‌లో మ్యాక్సీ ఆర్‌సీబీ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.

ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యత..

ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యత..

ధనాధన్ ఫార్మాట్ కావడంతో హర్షా.. పూర్తిగా ఆల్‌రౌండర్లకే ప్రాధన్యత ఇచ్చాడు. ఆరో స్థానంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌ను తీసుకున్న హర్షా.. ఏకైక స్పిన్నర్‌గా రషీద్ ఖాన్‌‌ను ఎంచుకున్నాడు. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది, సౌతాఫ్రికా పేస్ గన్ అన్రిచ్ నోర్జ్‌తో పాటు టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాలను పేసర్లుగా ఎంచుకున్నాడు.

ఈ బెస్ట్ ఎలెవన్‌తో పాటు మరో నలుగురిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసిన హర్షా.. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, న్యూజిలాండ్ బౌలర్ లూకీ ఫెర్గూసన్, శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా, ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టోలకు చోటిచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కకపోవడం విశేషం.

హర్షా భోగ్లే టీ20 ప్లేయింగ్ ఎలెవన్..

హర్షా భోగ్లే టీ20 ప్లేయింగ్ ఎలెవన్..

మహమ్మద్ రిజ్వాన్, జోస్ బట్లర్, మిచెల్ మార్ష్, మొయిన్ అలీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆండ్రీ రస్సెల్, రషీద్ ఖాన్, షాహిన్ షా అఫ్రిది, అన్రిచ్ నోర్జ్, జస్‌ప్రీత్ బుమ్రా

రిజర్వ్ ప్లేయర్స్: కేఎల్ రాహుల్, లూకీ ఫెర్గూసన్, వానిందు హసరంగా, జానీ బెయిర్ స్టో

Story first published: Wednesday, December 29, 2021, 14:47 [IST]
Other articles published on Dec 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X