న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్కసారి కాఫీ తాగే.. భారీ మూల్యం చెల్లించుకున్నా: హార్దిక్ పాండ్యా

Hardik Pandya Speaks About Controversial Koffee With Karan Episode

ముంబై: తన జీవితంలోనే అత్యంత వివాదస్పద ఘటనగా మిగిలిపోయిన 'కాఫీ విత్ కరణ్'షో‌పై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. కరోనా కారణంగా ప్రస్తతం ఇంటికే పరిమితమైన ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్.. తాజాగా టీమిండియా సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యా కూడా పాల్గొన్న ఈ చిట్‌చాట్‌లో.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అయితే గతేడాది బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్'షోలో హార్థిక్ పాండ్యా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రస్థా దుమారం రేగిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్‌తో కలిసి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న పాండ్యా.. మహిళలను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురిసింది. దీంతో ఈ ఇద్దరి క్రికెటర్లపై బీసీసీఐ తాత్కలిక నిషేధం విధించింది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా రప్పించింది.

టాంపరింగ్ మంచిది కాదు.. ఉమ్మికి మించింది లేదు: భారత స్టార్ బౌలర్లుటాంపరింగ్ మంచిది కాదు.. ఉమ్మికి మించింది లేదు: భారత స్టార్ బౌలర్లు

చాలా కాస్ట్‌లీ కాఫీ..

చాలా కాస్ట్‌లీ కాఫీ..

ఆ తర్వాత వీరిద్దరు బేషరతుగా క్షమాపణలు చెప్పగా.. బీసీసీఐ నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే ఈ ఘటన జరిగి ఏడాదైనందుకు అభిమానులెవరూ వివాదాస్పద ప్రశ్నలు అడగవద్దని దినేశ్ కార్తీక్ అభిమానులను కోరాడు. దీనికి పాండ్యా బదులిస్తూ... ఒకసారి కాఫీ తాగే..భారీ మూల్యం చెల్లించుకున్నానని తెలిపాడు.‘నేను అసలు కాఫీ తాగను, గ్రీన్ టీ తాగుతాను. కానీ, ఒకసారి కాఫీ తాగి.. భారీ మూల్యం చెల్లించుకున్నా. స్టార్‌బక్స్‌లో తాగినా.. అంత ఖర్చు అయ్యేది కాదు. అప్పటి నుంచి కాఫీకి దూరంగా ఉంటున్నా'అని హార్థిక్ తెలిపాడు.

బీసీసీఐ తర్వాత అంతలా..

బీసీసీఐ తర్వాత అంతలా..

ఇక ఐపీఎల్ వాయిదాపై కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. ఈ క్యాష్ రిచ్ లీగ్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.దీనికి కార్తీక్ బదులిస్తూ పాండ్రా బ్రదర్స్‌ను ట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ‘ఐపీఎల్ జరగకపోతే.. బీసీసీఐ తర్వాత అంతగా నష్టపోయేది పాండ్యా బ్రదర్సేనని, వారు బాధపడినట్లుగా మరేవరు ఉండరు'అని కార్తీక్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు..

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు..

‘కాఫీ విత్ కరణ్' షోలో హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి కరణ్ జోహార్ అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దూమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.

ఇటీవల రాహుల్ కూడా..

ఇటీవల రాహుల్ కూడా..

ఇటీవల రాహుల్ కూడా ఈ వివాదాస్పద షో‌పై స్పందించాడు. తన 28వ బర్త్‌డే సందర్భంగా.. సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ లైవ్ సెషన్‌లో మయాంక్ అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ముఖ్యంగా తన కెరీర్‌లోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోయిన కాఫీ విత్ కరణ్ షో వివాదాన్ని గుర్తు చేసుకోని నవ్వులు పూయించాడు.

లైవ్ సెషన్‌లో భాగంగా మయాంక్.. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అని రాహుల్‌కు తెలియజేశాడు. దీనికి రాహుల్..‘ఈ ర్యాపిడ్ ఫైర్ ఎప్పుడూ నా కొంప ముంచుతందని నీకు తెలుసు. ఈ రౌండ్ వల్ల నేను చాలా నష్టపోయాను'అని కాఫీ విత్ కరణ్ షో గుర్తు చేసుకొని ఫన్నీగా బదులిచ్చాడు. ఈ సమాధానం విన్న మయాంక్ పడిపడి నవ్వుకున్నాడు.

Story first published: Sunday, April 26, 2020, 14:44 [IST]
Other articles published on Apr 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X