For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన హార్దిక్ పాండ్యా.. ఆ చాన్స్ కోసమే వెయిటింగ్ అంటూ బోల్డ్ కామెంట్స్!

Hardik Pandya says If I get India permanent captain opportunity, Ill be more than happy to do that

ఫ్లోరిడా: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా దిగ్విజయంగా ముగించింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 88 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. వైస్ కెప్టెన్ హోదాలో తాత్కలిక సారథిగా హార్దిక్ పాండ్యా జట్టును నడిపించాడు. తనదైన కెప్టెన్సీతో విండీస్ పతనాన్ని శాసించాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం చాలా ప్రత్యేకమని చెప్పాడు.

సంతోషంగా స్వీకరిస్తా..

సంతోషంగా స్వీకరిస్తా..

దాంతో టీవీ హోస్ట్.. పూర్తి స్థాయిలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవాలనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు. దీనికి హార్దిక్ ఎలాంటి మొహమాటం లేకుండా అవునని బదులిచ్చాడు. ఆ అవకాశం వస్తే సంతోషంగా స్వీకరిస్తానని తన మనసులోని మాటను బయటపెట్టాడు. 'మన దేశానికి సారథ్యం వహించే అవకాశం రావడం చాలా ప్రత్యేకం. ఆ అవకాశంతో పాటు విజయాన్ని అందుకోవడం కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా నాకు సంతోషంగా ఉంది. నేను నా కెప్టెన్సీ బాధ్యతను సమర్దవంతంగా నిర్వర్తించాను. టీమిండియా సారథిగా అవకాశం వస్తే సంతోషంగా స్వీకరిస్తాను.

క్రెడిట్ మేనేజ్‌మెంట్‌దే

క్రెడిట్ మేనేజ్‌మెంట్‌దే

వరల్డ్ కప్, ఆసియాకప్ టోర్నీలపై మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మా జట్టులో అపార నైపుణ్యం కలిగిన ప్లేయర్లు ఉన్నారు. మేం మా ఆటతో ఇది న్యూ ఇండియా అని చాటి చెపుతున్నాం. ప్రతీ ఒక్కరు తమ సత్తా ఎంటో చూపిస్తున్నారు. ఎవరికైన స్వేచ్చ ఉంటే ప్రమాదకరంగా ఆడుతారు. ఈ క్రెడిట్ అంతా టీమ్‌మేనేజ్‌మెంట్‌ది. జట్టు వాతావరణాన్నే మార్చేసింది. జట్టుకు ఎంపిక కాలేదని, ఉద్వాసనకు గురయ్యామనే ఆందోళన ఆటగాళ్లలో ఏ మాత్రం లేదు.'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

అతనికి ఆ సత్తా ఉంది..

అతనికి ఆ సత్తా ఉంది..

ఇక స్పిన్నర్లే పది వికెట్లు తీయడంపై స్పందిస్తూ.. 'అక్షర్ పటేల్‌కు కొత్త బంతినిచ్చి అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు చేయాలనుకున్నా. అంతేకాకుండా డాట్ బాల్స్ వేసేలా ప్రోత్సహించా. అతనికి ఆ సత్తా ఉందనే విషయం నాకు తెలుసు. అతను కట్టడిగా బౌలింగ్ చేసి వికెట్లు తీసే పరిస్థితులను కల్పిస్తాడు. మణికట్టు స్పిన్నర్లు బ్యాటర్లు ఇబ్బంది పెట్టే వెపన్స్. అందుకే వారికి వరుసగా ఓవర్లు ఇస్తూ.. బౌలింగ్‌ను ఆస్వాదించమని చెప్పాను. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌కు అన్ని విధాలుగా సిద్దమయ్యాం. నిలకగా బ్యాటింగ్ చేయడం, ఒత్తిడిని, పరిస్థితులను అర్థం చేసుకోవడం నేర్చుకున్నాం. అయితే క్రీడల్లో ప్రతీ రోజు కొత్త దినమే. నేర్చుకునేందుకు చాలా ఉంటుంది. మా విజయాల్లో అభిమానుల పాత్ర కూడా ఉంది. మాకు విశేష ఆదరణ లభించింది. విదేశాల్లో ఆడుతున్న ఫీలింగ్ అస్సలు కలగలేదు.'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

100కు ప్యాకప్..

100కు ప్యాకప్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్‌ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తర్వాత వెస్టిండీస్‌ 15.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. బిష్ణోయ్‌ (4/16), కుల్దీప్‌ (3/12), అక్షర్‌ పటేల్‌ (3/15)ల స్పిన్‌ ఉచ్చులో పడిన కరీబియన్‌ను హెట్‌మైర్‌ (35 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నా ఫలితం లేకపోయింది.

Story first published: Monday, August 8, 2022, 8:58 [IST]
Other articles published on Aug 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+