న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ వివాదాన్ని ప్రపంచం మరిచినా.. ఆ గాయాలు పచ్చిగానే ఉన్నాయి: హార్దిక్ పాండ్యా

Hardik Pandya says I really didn’t know what misogynistic meant

కాన్‌బెర్రా : తన జీవితంలోనే అత్యంత వివాదస్పద ఘటనగా మిగిలిపోయిన 'కాఫీ విత్ కరణ్'షో‌పై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి స్పందించాడు. ఈ వివాదాన్ని ప్రపంచం మరిచిపోయినా.. ఆ ఘటన వల్ల తనకైనా గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని తెలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొడుతున్న ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్.. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి గడ్డు క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

ఆ సమయంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందన్నాడు. ఆ వివాదం కారణంగా ప్రపంచమంతా తనను (misogynist)స్త్రీద్వేషిగా పిలిచిందని, ఆ సమయంలో ఆ పదం అర్థం ఏంటో కూడా తనకు తెలియదన్నాడు.

మహిళలు మా ఇంట్లో ఉన్నారు..

మహిళలు మా ఇంట్లో ఉన్నారు..

ఆ పదం అర్థం కూడా తెలియదు.. ‘నిజంగా చెబుతున్నా ఆ సమయంలో misogynist అర్థం ఏంటో కూడా నాకు తెలియదు. తొలుత నన్ను ఎగతాళి చేయడానికకి వాడుతున్న పదమని నవ్వుకున్నాను. కానీ నా స్నేహితుడొకడు.. ఈ పదానికి అర్థం చెప్పాడు. మహిళలను ద్వేషించే వ్యక్తిని ఇలా పిలుస్తారని చెప్పాడు. నేనేందుకు మహిళలను ఇష్టపడను అనిపించింది. అమ్మ, వదినా, సోదరి, నటాషా వీళ్లంతా మహిళలే కదా. వారందరిని నేను గౌరవిస్తాను. ఆరాదిస్తాను. మా ఇళ్లంతా మహిళలే. వారుండటం వల్లే మేం ఉన్నాం.'అని తెలిపాడు.

నాకు నేను లాక్ చేసుకున్నా..

నాకు నేను లాక్ చేసుకున్నా..

ఇక ఈ కాంట్రవర్సీ కారణంగా తాను అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నానని, తనకు తాను నిర్భందించుకున్నానని తెలిపాడు. కుటుంబం అండతో మళ్లీ ఈ క్లిష్ట స్థితిలోనుంచి భయటపడ్డానన్నాడు. ‘నా జీవితంలోనే మొదటిసారి నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. నా చుట్టూ ఉన్నవన్నీ కుప్పకూలిపోయాయి. నన్ను నేను బంధించుకోవాల్సి వచ్చింది. నా కుటుంబమే లేకుంటే అన్నీ కోల్పోయేవాడిని. వారే నాకు వెన్నుముకగా ఉన్నారు. నా కుటుంబంలో మహిళలు కూడా ఉన్నారు'అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

నోరు జారి..

నోరు జారి..

రెండేళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్'షోలో హార్థిక్ పాండ్యా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రస్థా దుమారం రేగిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్‌తో కలిసి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న పాండ్యా.. మహిళలను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురిసింది. దీంతో ఈ ఇద్దరి క్రికెటర్లపై బీసీసీఐ తాత్కలిక నిషేధం విధించింది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా రప్పించింది. తప్పైందని వేడుకున్న రూ. 20 లక్షల ఫైన్ కట్టించడంతో పాటు మరో క్రికెటర్ నోరు జారకుండా గట్టిగానే బుద్ది చెప్పింది.

తన శృంగారం గురించి..

తన శృంగారం గురించి..

‘కాఫీ విత్ కరణ్' షోలో హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి కరణ్ జోహార్ అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దూమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.

Story first published: Friday, December 4, 2020, 16:07 [IST]
Other articles published on Dec 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X