న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాయాలు ప్రేరణనిస్తాయి.. ఐపీఎల్ కోసం ఆగలేకపోతున్నా: హార్దిక్ పాండ్యా

Hardik Pandya says He Accepts Injuries As Part Of Career

దుబాయ్: గాయాలు తనకు మరింత ప్రేరణనిస్తాయని ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉన్నానని తెలిపిన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఐపీఎల్‌ కోసం ఆగలేకపోతున్నానన్నాడు. ఈ శనివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే ఫస్ట్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు. ఆసియాకప్‌ సమయంలో గాయపడ్డ హార్దిక్‌ పాండ్యా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. దాంతో అతను కొంతకాలం అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యాడు.

దేశవాళీ టోర్నీలో మెరిసి..

అయితే మార్చికి ముందు డీవై పాటిల్‌ టీ20 టోర్నీలో శతకాలతో విరుచుకుపడ్డ పాండ్యా లాక్‌డౌన్ ముందు సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆ సిరీస్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలనుకున్నాడు. కానీ తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. మిగత రెండు వన్డేలు కరోనాతో ఆగిపోయాయి. దీంతో పాండ్యా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఈ గ్యాప్‌లో ప్రియురాలు నటాషా స్టాన్ కోవిచ్‌ను పెళ్లి చేసుకున్నాడు.. తండ్రి కూడా అయ్యాడు. ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో ఉన్న పాండ్యా ఐపీఎల్‌లో చెలరేగేందుకు సిద్దమవుతున్నాడు.

గ్రాండ్ రీఎంట్రీ కోసం..

గ్రాండ్ రీఎంట్రీ కోసం..

తాజాగా ముంబై ఇండియన్స్ వన్ ఫ్యామిలీ షోలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ప్రస్తుతం బంతిని చక్కగా బాదుతున్నా. నేనిప్పుడున్న శారీరక, మానసికంగా ప్రశాంతం ఉన్నా. ఈ పరిస్థితుల్లో పూర్వ వైభవం అందుకోవడం సులువైన పనే. ఆటకు ఎంతకాలం దూరమైనా ఫర్వాలేదు. నా పునరాగమనం విలువైందిగానే ఉంటుంది. ఆట కోసం నేను చాలా చక్కగా సిద్ధమయ్యాను. సానుకూలంగా ఉన్నాను. ఐపీఎల్‌ను నేనెంతో ఆస్వాదిస్తాను. ఘనంగా పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నా' అని హార్దిక్‌ అన్నాడు.

గాయాలు సహజం..

గాయాలు సహజం..

'జీవితంలో గాయలెప్పుడూ మనతోనే ఉంటాయని తెలుసుకున్నాను. గాయపడాలని ఎవరూ కోరుకోరు. అయితే అలా జరగకుండా ఉండదనేది సత్యం. గాయాలెప్పుడూ ఒకడుగు ముందుకేసుందుకే నాకు ప్రేరణనిస్తాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌ కోసం ఇబ్బందులేమీ పడలేదు. మా ఇంట్లో జిమ్‌ ఉండటంతో నేనూ, నా సోదరుడు కృనాల్ పాండ్యా రోజూ కసరత్తులు చేశాం. కోలుకున్న తర్వాత డీవై పాటిల్‌ ఆడటం అదృష్టం. జీవితంలో మరెన్నో అద్భుతాలు జరుగుతాయని అనిపిస్తోంది' అని పాండ్యా ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, September 16, 2020, 21:07 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X