న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో వన్డేలో జాదవ్‌ను పక్కనపెట్టి చాహల్‌ను ఆడించాలి: హర్భజన్

Harbhajan Singh Says India should play Yuzvendra Chahal and Kuldeep Yadav together in the upcoming ODI

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఓడిన భారత్.. రెండో వన్డేలో గెలవాలంటే కొన్ని మార్పులతో బరిలోకి దిగాలని వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను పక్కనపెట్టి అదనపు స్పిన్నర్‌గా యుజువేంద్ర చాహల్‌ను తీసుకోవాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటున్న కివీస్ బ్యాట్స్‌మన్.. స్పిన్‌లో మాత్రం తడబడతున్నారని, అందుకే ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్నాడు. అలాగే మిడిల్ ఓవర్లలో వికెట్లు దక్కే అవకాశం కూడా ఉంటుదని ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ హర్భజన్ అభిప్రాయపడ్డాడు.

అందుకే అంబటి రాయుడిపై వేటు.. చాలా బాధపడ్డా : ఎమ్మెస్కేఅందుకే అంబటి రాయుడిపై వేటు.. చాలా బాధపడ్డా : ఎమ్మెస్కే

'నేనైతే ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్ ఆడాలనుకుంటున్నా. న్యూజిలాండ్ టీమ్ ఎప్పుడైనా పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. కానీ స్పిన్నర్ల విషయంలో మాత్రం ఎప్పుడూ తడబడుతుంది. పైగా మిడిల్ ఓవర్లలో కూడా స్పిన్నర్లు వికెట్లు తీయవచ్చు. అందుకే ఇద్దరు స్పిన్నర్లు ఆడాలనుకుంటున్నా. కేదార్ జాదవ్‌ను పక్కనపెట్టి అదనపు స్పిన్నర్‌ను తీసుకుంటారని భావిస్తున్నా'అని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇక భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే అక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా శనివారం జరగనుంది.

అయితే తొలి వన్డేలో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ రెండు వికెట్లు తీసి 84 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మూడో భారత స్పిన్నర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

నువ్వేం అంపైర్ సామీ.. ఇంత బిత్తిరి నిర్ణయమా?నువ్వేం అంపైర్ సామీ.. ఇంత బిత్తిరి నిర్ణయమా?

ఇక ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 103 ) కెరీర్‌లో తొలి సెంచరీ‌తో సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిసారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాస్ టేలర్(109 నాటౌట్) అజేయ సెంచరీకి తోడు నికోలస్(78), స్టాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. షమీ, ఠాకుర్ చెరొక వికెట్ తీశారు.

Story first published: Thursday, February 6, 2020, 14:02 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X