Happy Birthday Yuvraj Singh: వీడియో రూపంలో విరాట్ కోహ్లీ స్పెషల్ విషెస్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆదివారం 40వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో సహా పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సిక్సర్ల సింగ్‌కు ప్రత్యేకంగా విషెస్‌ చెబుతున్నారు. అతని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను గుర్తు చేసుకుంటున్నారు. దాంతో ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ తెరిచినా యూవీ పోస్ట్‌లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా యూవీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియో రూపంలో విషెస్‌ చెప్పాడు.

యువీతో స్పెషల్ బాండ్..

'నేను అండర్‌-19 ప్రపంచకప్‌ తర్వాత భారత్‌ జట్టులోకి వచ్చాను. నాకు యువీ ఘనంగా స్వాగతం పలికాడు. నాతో సరదాగా మాట్లాడటం, ఉండడం చేసేవాడు. మేము ఒకే రకమైన ఫుడ్‌ను ఇష్టపడతాము, అదే విధంగా మా ఇద్దరికీ పంజాబీ సంగీతం అంటే ఇష్టం. ఇద్దరం కలిసే షాపింగ్ చేసేవాళ్లం. శ్రీలంక పర్యటనలో ఓసారి సైకిల్ రైడ్‌కు వెళ్లి కింద కూడా పడ్డాం. మరో రెండు రోజుల్లో మ్యాచ్ ఉండగా ఈ ఘటన జరిగింది. దాంతో అందరం నవ్వుకున్నాం." అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది అతనికి సుఖ సంతోషాలు ఇవ్వాలంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు.

402 మ్యాచ్‌ల్లో..

402 మ్యాచ్‌ల్లో..

ఇక యువరాజ్‌ తన 19 ఏ‍ళ్ల కెరీర్‌లో టీమిండియా తరపున మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 11,778 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 148 వికెట్లు పడగొట్టి మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు.

యూవీ ఫైటర్..

యూవీ ఫైటర్..

ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ యువీలోని పోరాటపటిమను గుర్తుచేస్తూ అతనికి ప్రత్యేకంగా విషెస్‌ చెప్పింది. ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ఫీల్డ్‌.. యువరాజ్‌ ఎక్కడైనా పోరాట యోధుడే అంటూ కొనియాడింది. ఈ మాజీ ఆల్‌రౌండర్‌.. 2011 వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్యాన్సర్‌ బారినపడిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం జట్టులోకి తిరిగొచ్చి మళ్లీ మునుపటిలా రాణించాడు. పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ నేపథ్యంలోనే ముంబై జట్టు అతన్ని ఫైటర్‌ అంటూ ప్రశంసించింది. అలాగే 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. అయితే, 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి టీమిండియా యాజమాన్యం అతడిని ఎంపికచేయకపోవడంతో నిరాశకు గురయ్యాడు. కొద్దిరోజులకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆపై పలు లీగ్‌ టోర్నీల్లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, December 12, 2021, 17:57 [IST]
Other articles published on Dec 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X