న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచ కప్‌కు కోహ్లీ కోసమైనా.. ధోనీ ఉండాల్సిందే'

Gavaskar says MSD is an absolute must in India team for 2019 World Cup

హైదరాబాద్: ఓ పక్క పేలవ ఫామ్‌తో జట్టులో కొనసాగుతున్న ధోనీని పక్కకు తప్పించడమే సబబు అంటూ కామెంట్లు వస్తున్న తరుణంలో సునీల్ గవాస్కర్ దానికి విరుద్ధంగా చెప్పుకొస్తున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌లో ధోనీ ఆడటం భారత్ జట్టుకి అవసరమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ల కోసం జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. ధోనీపై వేటు వేసిన సంగతి తెలిసిందే.

 పంత్‌కి వికెట్ కీపర్‌గా ఛాన్స్ ఇచ్చేందుకే

పంత్‌కి వికెట్ కీపర్‌గా ఛాన్స్ ఇచ్చేందుకే

అతని స్థానంలో రిషబ్ పంత్‌కి వికెట్ కీపర్‌గా ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎమ్మెస్కే టీమిండియాకు కీపర్ స్థానం కోసం తయారుచేసేందుకే పంత్‌ను తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో.. టీ20ల్లోనూ ఇకపై ధోనీ ఆడడంటూ వార్తలు వస్తున్నాయి. ప్రపంచ కప్‌ సమయాని కంటే ముందుగానే వన్డేల్లోనూ ధోనీపై వేటు పడబోతుందని వార్తలు వస్తున్నాయి.

రాయుడు తెలివైన బ్యాట్స్‌మన్, అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు: కోహ్లీ

సిద్ధంగా లేకపోవడం వల్లే ఎంపిక చేయలేదని

సిద్ధంగా లేకపోవడం వల్లే ఎంపిక చేయలేదని

దీనిపై స్పందించిన ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. ధోనీ వెస్టిండీస్‌తో జరగనున్న ఆరు టీ20ల సిరీస్‌ను ఆడేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లనే అతణ్ని ఎంపిక చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో ఇకమీదట టీ20 ఫార్మాట్‌లో ఆడడనే అపోహలేమీ పెట్టుకోవద్దని వివరించాడు.

భారత్ జట్టేకాదు.. కెప్టెన్ కోహ్లీ కూడా

భారత్ జట్టేకాదు.. కెప్టెన్ కోహ్లీ కూడా

ఒకవేళ ప్రపంచ కప్‌లో జట్టులో ధోనీ ఆడితే మాత్రం.. లాభపడేది భారత్ జట్టేకాదు.. కెప్టెన్ కోహ్లీ కూడా అంటూ సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో టీమిండియాకు ధోనీ ఆవశ్యకత ఎంత ఉందనే అంశంపై విశ్లేషించాడు.

ప్రతి అంశాన్ని కెప్టెన్‌ చూసుకోవడం కష్టం

ప్రతి అంశాన్ని కెప్టెన్‌ చూసుకోవడం కష్టం

‘ప్రపంచకప్‌లో ధోనీ అవసరం విరాట్ కోహ్లి చాలా ఉంది. ఎందుకంటే.. 50 ఓవర్ల మ్యాచ్‌లో ప్రతి అంశాన్ని కెప్టెన్‌ చూసుకోవడం కష్టమవుతుంది. ఒకవేళ ధోనీ.. జట్టులో ఉంటే.. ఫీల్డింగ్ మార్పులు, బౌలర్లతో హిందీలో మాట్లాడుతూ సూచనలు చేయడం, వారు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వెంటనే వికెట్ల వెనుక నుంచే హెచ్చరించడం లాంటి పనులు కెప్టెన్‌ కోహ్లీతో సంబంధం లేకుండా వేగంగా చక్కబెట్టేస్తాడు. ప్రపంచకప్‌‌లో ఇది కచ్చితంగా విరాట్ కోహ్లీకి కలిసొచ్చే అంశం. ధోనీ లేకపోతే.. జట్టులో ఆ పనులు ఎవరు చేయగలరు..? ' అని గవాస్కర్ ప్రశ్నించాడు.

Story first published: Tuesday, October 30, 2018, 13:15 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X