ఎన్నడూ లేనంతగా 10 మందికి గాయాలు.. టీమిండియా కోలుకునేదెప్పుడో..?

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి ఆస్ట్రేలియా పర్యటనవరకు ఎన్నడూ లేనంతగా భారత ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇటీవలే కోలుకొని జట్టులోకి వచ్చాడని అభిమానులు సంతోషపడుతుంటే.. మరోవైపు గాయాలతో స్టార్ ఆటగాళ్లంతా ఒక్కక్కరుగా దూరమవుతున్నారు. భవిష్యత్తు సిరీస్‌ల దృష్ట్యా భారత ఆటగాళ్ల గాయాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

India vs Australia: Bumrah, Jadeja add to Team India's Growing Injury List | List of Injured Players

ఓసారి భారత గాయాల జాబితాను పరిశీలిస్తే.. భువనేశ్వర్-తొడకండరం, ఇషాంత్ శర్మ పక్కటెముకలు, మహ్మద్ షమీ మణికట్టు, ఉమేశ్ యాదవ్ కాలిపిక్క, కేఎల్ రాహుల్ మణికట్టు, రవీంద్ర జడేజా బొటన వేలు, విహారి తొడకండరాలు గాయాలతో ఉండగా.. రిషభ్ పంత్, అశ్విన్ సైతం దెబ్బలున్నా నెట్టుకొస్తున్నారు. తాజాగా జస్‌ప్రీత్ బుమ్రా పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ ఈ జాబితాలో చేరాడు.

గాయపడంది వీరే..

ఇక భారత జట్టులో గాయపడ్డవారి జాబితా చెప్పడం కన్నా... గాయపడని జాబితా చెప్పడం చాలా సులువుగా ఉంది. ప్రస్తుతం నాలుగు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమంగా ఉండగా.. సిరీస్ డిసైడ్ మ్యాచ్ జనవరి 15 నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానుంది. గాయాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేయడం టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తలొనొప్పిగా మారనుంది. ప్రస్తుతానికి తదుపరి మ్యాచ్‌కు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, రహానే, రిషభ్ పంత్, సాహా, పృథ్వీ షా, అశ్విన్, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకుర్, నటరాజన్, కుల్దీప్ యాదవ్‌లు మాత్రమే అందుబాటలో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ స్కానింగ్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

అంతా యువ పేసర్లే..

ఇప్పటికే స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో దూరమవ్వగా.. మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ అనుభంలేని బౌలర్లతో బుమ్రా బౌలింగ్ విభాగాన్ని నెట్టుకొచ్చాడు. ఇప్పుడు అతను కూడా దూరమైతే జట్టులో అంతా అనుభవలేమి బౌలర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. బుమ్రా స్థానంలో నటరాజన్ జట్టులోకి రావచ్చు. అతనికిది అరంగేట్ర మ్యాచ్ కాగా.. సిరాజ్, నవ్‌దీప్ సైనీలు కూడా ఈ సిరీస్‌తోనే సంప్రదాయక ఫార్మాట్‌లోకి అడుగుపెట్టారు. ఇక జడేజా స్థానంలో జట్టులోకి వచ్చే శార్దుల్ ఠాకుర్‌‌కు కూడా అనుభవం లేదు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అతను గాయపడ్డాడు. ఒక రకంగా అతనికి కూడా ఇది అరంగేట్రం అన్నట్లే. మరీ ఈ నలుగురు యువ పేసర్లు రాణించడంపైనే భారత విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఇంగ్లండ్‌తో సిరీస్ కష్టమే..

ప్రస్తుతానికి ఆస్ట్రేలియా‌తో సిరీస్‌ను ముగించినా.. వచ్చె నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే సిరీస్‌లకు కష్టాలు తప్పేలా లేవు. బుమ్రా అందుబాటులోకి వచ్చినా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ గాయాలపై క్లారిటీ లేదు. భువీ ఐపీఎల్‌లోనే గాయపడినా అతను ఇంకా కోలుకోలేదు. ఇక పరిమిత ఓవర్లలో కీలకంగా మారిన కేఎల్ రాహుల్ రాక కూడా అనుమానంగానే మారింది. బొటనవేలు విరిగిన జడేజాకు సర్జరీ చేయగా.. అతను ఇంగ్లండ్ సిరీస్ ఆడటం కష్టమే. వీరి స్థానాల్లో అవకాశాలు అందుకునే యువ ఆటగాళ్లు సత్తా చాటితేనే భారత్ పరువు దక్కతుంది. లేదంటే కష్టాలు తప్పవు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, January 12, 2021, 11:53 [IST]
Other articles published on Jan 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X