న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడే ద్రవిడ్ అంటే గౌరవం పెరిగింది: వెస్టిండీస్ మాజీ బౌలర్

Former West Indies fast bowler Tino Best Explains Rahul Dravid’s greatness

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌పై వెస్టిండీస్ మాజీ బౌలర్ టినో బెస్ట్ ప్రశంసల జల్లు కురిపించాడు. 2005లో శ్రీలంక వేదికగా జరిగిన ఇండియన్ ఆయిల్ కప్ ట్రై సిరీస్‌లో ద్రవిడ్ గొప్పతన తెలిసిందని, ఆ క్షణమే అతనంటే గౌరవం పెరిగిందని ఈ మాజీ విండీస్ పేసర్ గుర్తు చేసుకున్నాడు. ఆ ట్రై సిరీస్‌లోనే తాను తొలిసారి భారత జట్టుతో ఆడానని, ద్రవిడ్‌కు బౌలింగ్ చేసే అవకాశం దక్కిందని 'స్పోర్ట్స్ కీదా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టినో గుర్తు చేసుకున్నాడు.

తన బౌలింగ్‌లో టీమిండియా వాల్ వరుసగా మూడు ఫోర్లు బాదాడని, మ్యాచ్‌ అనంతరం తన దగ్గరకు వచ్చి మాట్లాడాడని తెలిపాడు. 'ద్రవిడ్‌ నా వద్దకు వచ్చి 'యంగ్‌ మ్యాన్‌.. నీ శక్తి సామర్థ్యాలు నచ్చాయి. అలాగే కొనసాగు. నీ బౌలింగ్‌లో ఫోర్లు కొట్టినంత మాత్రాన అక్కడే ఆగిపోకు' అని చెప్పాడు. దాంతో ఆయనంటే నాకు గౌరవం పెరిగింది.

అలా నేనెప్పుడూ భారత క్రికెటర్లను అభిమానిస్తూ ఉంటాను. ఒకసారి యువరాజ్‌ నాకు బ్యాట్‌ ఇచ్చాడు. భారత క్రికెటర్లు ఎంతో మంచివాళ్లు. వినయంగా ఉంటారు. తాము గొప్పవాళ్లమని ఎప్పుడూ అనుకోరు. వారిలో నాకు అదే నచ్చుతుంది. వాళ్లెప్పుడూ చెడు విషయాల జోలికి వెళ్లరు. ఎప్పుడూ ఆటను గౌరవిస్తూ దాని మీదే శ్రద్ధ పెడతారు' అని బెస్ట్‌ చెప్పుకొచ్చాడు. ఇక వెస్టిండీస్ తరఫున 25 టెస్ట్‌లు, 26 వన్డేలు, 6 టీ20లు ఆడిన టినో.. మూడు ఫార్మాట్లలో కలిపి 97 వికెట్లు తీశాడు.

Story first published: Sunday, July 19, 2020, 16:22 [IST]
Other articles published on Jul 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X