న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇమ్రాన్ ఖాన్‌.. నువ్వు ఓ దేవుడివని విర్రవీగుతున్నావ్: జావేద్ మియాందాద్‌

 Former Pakistan skipper Javed Miandad lashes out at PM Imran Khan for ruining cricket in Pakistan

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని, తన మాజీ సహచరుడు ఇమ్రాన్‌ ఖాన్‌‌పై ఆ దేశ లెజెండరీ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇమ్రాన్ ఖాన్ తనకు తాను ఓ దేవుడిగా భావిస్తూ విర్రవీగుతున్నాడని ధ్వజమెత్తాడు. అతని వల్లే పాక్ క్రికెట్ నాశనమైందని ఆరోపించాడు. పాక్‌ క్రికెట్‌ బోర్డులో ఉన్న అధికారులకు క్రికెట్ ఓనమాలు కూడా తెలియవన్నాడు. అలాంటి వారిచేతిలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను పెట్టాడని తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పించాడు.

క్రికెట్ ఏబీసీలు తెలియవు..

క్రికెట్ ఏబీసీలు తెలియవు..

‘పీసీబీలోని ఏ ఒక్క అధికారికీ క్రికెట్‌ గురించి అవగాహన లేదు. కనీసం క్రికెట్‌కు సంబంధించిన ఓనమాలు కూడా తెలియవు. బోర్డు వ్యవహారాలను ప్రధాని ఇమ్రాన్‌ పట్టించుకోవడంలేదు. పీసీబీలోని పరిస్థితులపై ఇమ్రాన్‌ ఖాన్‌తో వ్యక్తిగతంగా మాట్లాడతా. దేశంలో క్రికెట్‌ దుస్థితికి కారకులైన వారిని వదలను. విదేశాల నుంచి ఓ వ్యక్తి (వసీమ్‌ ఖాన్‌)ని తీసుకొచ్చారు. దోచుకొని పారిపోతే అతడిని మీరు పట్టుకోగలరా? పాక్‌లో ఎంతోమంది ఉండగా అతడే కావాల్సి వచ్చాడా? దేశ పౌరులు ఎదగాలి. నిజంగా మెరుగైన వ్యక్తులు లభించకపోతేనే బయటకు చూడాలి. కానీ అలా జరగడం లేదు' అని మియాందాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆలస్యం కాకముందే..

ఆలస్యం కాకముందే..

ఇక క్రికెట్‌ గురించి తనకొక్కడికే అంతా తెలుసునని ఇమ్రాన్‌ భావిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. డిపార్ట్‌మెంటల్‌ క్రికెట్‌ను రద్దుచేయడం మూలంగా యువ క్రికెటర్లకు ఉపాధి లభించడం లేదని మియాందాద్‌ అన్నాడు. దేశ భవిష్యత్తు వారేనని స్పష్టం చేశాడు. డిపార్ట్‌మెంటల్‌ క్రికెట్‌ను కొనసాగించాలని తాను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. ఆలస్యం కాకముందే పీసీబీని చక్కదిద్దాలని మియాందాద్‌ ఇమ్రాన్‌కు సూచించాడు.

విర్రవీగుతున్నావు..

విర్రవీగుతున్నావు..

‘నేను నీ కెప్టెన్‌. కానీ నువ్వు నా కెప్టెన్ కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నీ గురించి మాట్లాడుతా. సారథిగా నిన్ను నేను ప్రోత్సహించా. కానీ నువ్వు మాత్రం ఓ దేవుడులా ఫీలవుతున్నావు. దేశంలోనే నీ అంత ఇంటిలిజెంట్ లేడని విర్రవీగుతున్నావ్. మరెవరూ ఆక్సఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇతర యూనివర్సిటీలో చదివనవారు లేరనుకుంటున్నావ్. ముందు ప్రజల గురించి ఆలోచించు. దేశం గురించి పట్టించుకో. దమ్ముంటే నిన్ను ప్రధాని చేయడంలో నా పాత్ర లేదని చెప్పు. దేశంలోని సాధారణ ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తున్నా. నేను నా ఫీల్డ్ వేరే అయినా.. ప్రపంచం గురించి ఆలోచిస్తాను. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతా.'అని ఇమ్రాన్‌పై మియాందాద్ ధ్వజమెత్తాడు.

ఇక పాక్ తరఫున 124 టెస్ట్‌లు, 233 వన్డేలు ఆడిన మియాందాద్.. సంప్రదాయక ఫార్మాట్‌లో 8832 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వన్డేల్లో 8 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలతో 7381 రన్స్ చేశాడు.

IPL 2020: బీసీసీఐ సరికొత్త ప్లాన్.. రూ. 300 కోట్లు టార్గెట్!

Story first published: Thursday, August 13, 2020, 10:24 [IST]
Other articles published on Aug 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X