న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: ఓయ్ రోహిత్.. అప్పుడే గుండు కొట్టించారు! ఇప్పుడు ఓడితేనా..?

Fans Warns Rohit Sharma ahead of India vs Bangladesh Odi Series

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ పర్యటనలో తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత్‌.. ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాను ఢీకొనబోతోంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనలో ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడిన భారత్‌.. ఈ పర్యటనలో పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దించుతోంది. కెప్టెన్‌ రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. పొట్టి కప్పులో పేలవ ఫామ్‌తో విమర్శలెదుర్కొన్న రోహిత్‌, కేఎల్ రాహుల్‌ బంగ్లాపై చెలరేగిపోతారేమో చూడాలి. భారత తుది జట్టు కూర్పు కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి క్రమంగా ఎదుగుతూ పెద్ద జట్లను తరచుగా ఓడిస్తున్న బంగ్లాదేశ్‌ను భారత్‌ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.

5 మ్యాచ్‌లే ఓడినా..

ఇరు జట్ల మధ్య హెడ్ టూ హెడ్ రికార్డ్స్‌లో భారత్‌దే పై చేయి అయినా బంగ్లాను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 36 వన్డే మ్యాచ్‌లు జరగ్గా భారత్ 30 గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే ఈ ఓడిన ఐదు వన్డేల్లో 2007 వన్డే వరల్డ్ కప్ పరాభావం కూడా ఉంది. ఆ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో ఓడి ఇండియా ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని సొంతగడ్డపై బంగ్లాదేశ్ చాలా ప్రమాదకరమని, ఆసీస్, న్యూజిలాండ్ జట్లను కూడా ఓడించిందని గుర్తు చేస్తున్నారు.

 2015లో గుండ్లు కొట్టించారు..

2015లో గుండ్లు కొట్టించారు..

బంగ్లాదేశ్‌లో చివరగా 2015లో టీమిండియా వన్డే సిరీస్‌ ఆడింది. అప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మహేంధ్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత్‌ 1-2తో అనూహ్య పరాభవం చవిచూసింది. ముస్తాఫిజుర్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే 5 వికెట్లతో భారత్‌ నడ్డి విరిచి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. రెండో మ్యాచ్‌లోనూ 6 వికెట్లతో విజృంభించి జట్టుకు సిరీస్‌ అందించాడు. నామమాత్రమైన మూడో వన్డేలో భారత్‌ గెలిచింది. భారత్‌పై అరుదైన విజయం సిరీస్‌ విజయంతో బంగ్లాదేశ్ అభిమానులు రెచ్చిపోయారు. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్.. భారత ఆటగాళ్లకు గుండ్లు కొట్టినట్లుగా పోస్టర్లు వేయడం వివాదం రేపింది.

ఈసారి అయితే..

ఈసారి అయితే..

ఈ సిరీస్‌ను గుర్తు చేస్తూ మరీ రోహిత్ శర్మను అభిమానులు హెచ్చరిస్తున్నారు. అప్పుడే గుండ్లు కొట్టించారని, ఇప్పుడు గనుక ఓడితే.. ఇంకా ఓవర్ చేస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాలని సూచిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్ ఆటగాళ్లు, అభిమానులు చేసే అతి మాములగా ఉండదు. నిదహాస్ ట్రోఫీలోనూ నాగినీ డ్యాన్స్ చేసి అభాసుపాలయ్యారు. ఈ తరహా ప్రవర్తననే ప్రపంచం ముందు బంగ్లాదేశ్‌ను దోషిగా నిలబెట్టింది. ఆ జట్టుకు కనీసం సానుభూతి చూపించే పరిస్థితి లేకుండా చేసింది. భారత్‌తో విజయం సాధిస్తే ఆ జట్టు ఆటగాళ్ల, అభిమానుల అతి మాములుగా ఉండదని క్రికెట్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

మహమ్మద్ షమీ దూరం..

మహమ్మద్ షమీ దూరం..

ఈ పర్యటన ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. భారత సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి మరోసారి గాయపడ్డాడు. భుజం గాయం కారణంగా అతను బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. షమి స్థానంలో జమ్ము-కశ్మీర్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ జట్టులోకి ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ ఆడాక న్యూజిలాండ్‌ పర్యటనకు దూరంగా ఉన్న షమి.. బంగ్లాతో సిరీస్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. అతను బంగ్లాతో టెస్టు సిరీస్‌లో ఆడేది కూడా అనుమానమే. షమీ గైర్హాజరీలో కుల్దీప్ సేన్‌కు తొలి వన్డే అవకాశం దక్కవచ్చు.

Story first published: Sunday, December 4, 2022, 9:57 [IST]
Other articles published on Dec 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X