న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: కేఎల్ రాహుల్ ఉండగా కోహ్లీతో ఓపెనింగ్? టీమిండియా కొంపముంచిన ద్రవిడ్ ప్రయోగాలు..!

Fans Blames Rahul Dravids ‘Experiments’ For Indias Flop Show in 2nd ODI against Bangladesh

హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటనలో మరోసారి టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. మరో వన్డే మిగిలుండగానే టీమిండియా 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. ఏడేళ్ల క్రితం మహేంద్ర సిగ్ ధోనీ సారథ్యంలో ఓడిన టీమిండియా.. ఇప్పుడేమో రోహిత్ శర్మ కెప్టెన్సీలో అదే ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ రెండు వన్డేల్లో టీమిండియా స్వీయ తప్పిదాలతోనే ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహ్‌దీ హసన్ మిరాజ్ సంచలన ప్రదర్శనతోనే సునాయసంగా గెలవాల్సిన రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన ఓటమి పాలైంది. మెహ్‌దీ హసన్ సంచలన ప్రదర్శనకు తోడు రాహుల్ ద్రవిడ్ అతిప్రయోగాలు టీమిండియా కొంపముంచాయి.

8 ఏళ్ల తర్వాత..

కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపిస్తూ టీమిండియా చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. 8 ఏళ్ల తర్వాత వన్డే క్రికెట్‌లో శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ.. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఎబాదత్ హోస్సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షాట్ బాల్‌ను పుల్ షాట్ ఆడే క్రమంలో మూల్యం చెల్లించుకున్నాడు. అయితే వన్డే క్రికెట్‌లో విరాట్‌కు ఓపెనర్‌గా మంచి రికార్డులు లేవు. ఇది తెలిసి కూడా ద్రవిడ్ అతన్ని ఓపెనింగ్‌ పంపించి జట్టుకు నష్టం చేశాడు. ఇంతకుముందు 2008లో నాలుగుసార్లు, 2014లో ఓ మ్యాచ్‌లో మాత్రమే ఓపెనింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్‌లోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేదు.

రాహుల్ ఉండగా..

రాహుల్ ఉండగా..

రోహిత్ శర్మ అందుబాటులో లేకపోయినా కేఎల్ రాహుల్ రూపంలో ఓపెనింగ్ ఆప్షన్ ఉన్నా.. కోహ్లీని ఎందుకు ఓపెనర్‌గా ఆడించారనే విమర్శలు వస్తున్నాయి. కోహ్లీకి బదులు రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించి ఉంటే.. కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి తనకు అలవాటు అయిన శైలిలో నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించేవాడని, కీలక భాగస్వామ్యం నెలకొల్పేవాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఓపెనర్‌గా పంపించడంతో ధాటిగా ఆడాలనే ఉద్దేశంతో కోహ్లీ వికెట్ పారేసుకున్నాడని, ద్రవిడ్‌ను విమర్శిస్తున్నారు.

సుందర్‌ను అప్‌ది ఆర్డర్..

సుందర్‌ను అప్‌ది ఆర్డర్..

కోహ్లీ ఓపెనింగ్ ప్రయోగమే కాకుండా.. వాషింగ్టన్ సుందర్‌ను అప్‌ది ఆర్డర్ పంపిస్తూ చేసిన ప్రయోగం కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. కోహ్లీ, ధావన్ త్వరగా ఔటవ్వడంతో శ్రేయస్ అయ్యర్‌కు జతగా సుందర్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించారు. గతంలో రవీంద్ర జడేజాను ఆడించినట్లు ప్రయోగం చేసి మూల్యం చెల్లించుకున్నారు. మరోసారి షకీబ్ ఉల్ హసన్ ట్రాప్‌లో పడ్డ సుందర్.. నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో సుందర్ రాణించడంతో అతనిపై నమ్మకం ఉంచిన ద్రవిడ్ బొక్కబోర్లా పడ్డాడు. అతను కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సుందర్‌ను అక్షర్ తర్వాత పంపించి ఉంటే.. టీమిండియా ఫలితం మరోలా ఉండేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇకనైన ప్రయోగాలు ఆపాలని..

ఇకనైన ప్రయోగాలు ఆపాలని..

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాహుల్ ద్రవిడ్ విపరీతమైన ప్రయోగాలు చేస్తూ విఫలమవుతున్నాడు. ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చాడంటే అతను ఎన్ని ప్రయోగాలు చేశాడో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా ఓపెనర్ల దగ్గర్నుంచి బ్యాటింగ్ ఆర్డర్ దాకా ప్రతీ మ్యాచ్‌లోనూ ప్రయోగాలు చేస్తున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్... టీమ్‌ని కుదురుకోవడానికి సమయం కూడా లేకుండా చేస్తున్నాడని అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అనవసర ప్రయోగాలు మానుకొని ఓకే కాంబినేషన్‌తో ఆడాలని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సూచిస్తున్నారు.

Story first published: Thursday, December 8, 2022, 15:38 [IST]
Other articles published on Dec 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X