న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రైనా సెంచరీ, ధోనీ విధ్వంసకర ఇన్నింగ్స్ మరిచిపోలేనివి : ఫాఫ్ డూప్లెసిస్

Faf du Plessis Says Rainas century, Dhonis unbeaten 84 is favourite IPL memories

న్యూఢిల్లీ: గతేడాది ధోనీ ఆడిన(84 నాటైట్) విధ్వంసకర ఇన్నింగ్స్, 2013లో రైనా చేసిన సెంచరీ తన ఐపీఎల్ ఫేవరేట్ మూమెంట్స్ అని సౌతాఫ్రికా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డూప్లెసిస్ తెలిపాడు.

చెన్నై సూపర్ కింగ్స్ #MyIPLmoment చాలెంజ్‌లో భాగంగా రైనా విసిరిన సవాల్‌కు స్పందించిన డూప్లెసిస్.. ట్విటర్ వేదికగా ఓ వీడియో ద్వారా ఐపీఎల్ కెరీర్‌లో తాను ఎన్నటికీ మరిచిపోలేని క్షణాలను పంచుకున్నాడు.

నేను చాలా లక్కీ..

నేను చాలా లక్కీ..

‘గత పదేళ్లుగా చెన్నై జట్టులో భాగమైనందుకు చాలా అదృష్టవంతుడిగా ఫీలవుతున్నా. రెండు ఐపీఎల్ టైటిళ్లు, రెండో, మూడో చాంపియన్స్ లీగ్ ట్రోఫీలతో పాటు ఎన్నో మరవలేని అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. ఆ మధురమైన క్షణాలను ఒక్కొక్కటిగా చెప్పడానికి ప్రయత్నిస్తా. నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువే. నేను చెప్పేది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు.

ధోనీ విధ్వంసకర ఇన్నింగ్స్..

ధోనీ విధ్వంసకర ఇన్నింగ్స్..

గతేడాది ఆర్సీబీతో మ్యాచ్‌లో మేం 60 పరుగులకే ఆరో, ఏడో వికెట్లు కోల్పోయాం. ఆ పరిస్థితుల్లో మేం 90 పరుగులకే ఆలౌట్ అవుతామనుకున్నాం. కానీ ధోనీ తన సత్తా చాటాడు. వరుస సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను కొట్టే సిక్సులన్నీ దాదాపు మైదానం బయట పడ్డాయి. ఆఖరికి అతను 40 బంతుల్లోనే 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.

చివరి ఓవర్లో మా విజయానికి 26 పరుగులు అవసరం అనుకుంటా. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత అసలేం జరిగిందో మాకు అర్థం కాలేదు' అని డూప్లెసిస్ ధోనీ విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనియాడుతూ ఆ ఇన్నింగ్స్ తన ఫేవరెట్ అని తెలిపాడు. ధోనీ అద్భుతమైన ఫినిషర్ అని కితాబిచ్చాడు.

ఇక ఆర్‌సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో చెన్నై ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. డేల్ స్టేయిన్ ధాటికి 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో ధోనీ.. రాయుడుతో 55 పరుగులు, బ్రావో‌తో 25 పరుగులు జోడించి విజయానికి చేరువగా తీసుకెళ్లాడు.

ఐపీఎల్‌లో మరే భారత క్రికెటర్‌కు సాధ్యం కానీ హార్దిక్ పాండ్యా రికార్డు తెలుసా?

రైనా, బ్రావో విధ్వంసం..

రైనా, బ్రావో విధ్వంసం..

ఇక 2013లో కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో సురేశ్ రైనా 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. దీంతో చెన్నై భారీ స్కోర్ 186/4 చేసింది. ఈ మ్యాచ్‌లో ధోనీసేన 15 పరుగులతో గెలుపొందింది. ఇది కూడా తన పేవరేట్ మూమెంటేనని తెలిపిన డూప్లెసిస్.. 2018లో డ్వాన్ బ్రావో ఆడిన మరో ఇన్నింగ్స్ కూడా మరిచిపోలేనిదని చెప్పుకొచ్చాడు.

‘2013లో కింగ్స్‌ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ను రైనా ఒంటి చేత్తో గెలిపించాడు. అదో అద్భుత ఇన్నింగ్స్. ఇక 2018లో ముంబైతో జరిగిన ఓ మ్యాచ్‌లో బ్రావో అదరగొట్టాడు. దాదాపు ఆ మ్యాచ్‌పై మేం ఆశలు వదులుకున్నాం. అయితే ఏడో, ఏనిమిదో స్థానంలోనో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రావో తన విధ్వంసకర ఆటతో 40 బంతుల్లో 60 లేక 70 పరుగులో చేశాడు. కేవలం భారీ సిక్సర్లతోనే ఈ పరుగులు సాధించాడు. ఇప్పటికీ ఆ మ్యాచ్‌ మేం ఎలా గెలిచామో అర్థం కాదు' అని ఈ సఫారీ ప్లేయర్ తెలిపాడు.

షేన్ వాట్సన్ ఇన్నింగ్స్ కూడా..

షేన్ వాట్సన్ ఇన్నింగ్స్ కూడా..

ఇక 2018,2019 ఫైనల్లో షేన్ వాట్సన్ చేసిన పోరాటం కూడా అద్భతమని డూప్లెసిస్ తెలిపాడు. ‘2018 ఫైనల్లో షేన్ వాట్సన్ అద్భుత సెంచరీ.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించిన తీరు.. అలాగే 2019 ఫైనల్లో ఆఖరి వరకు గెలుపు కోసం అతను చేసిన పోరాటం అమోఘం. కానీ మేం విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాం. గత రెండేళ్లు వాట్సన్ అద్భుతంగా ఆడాడు.' అని ఈ సఫారీ మాజీ కెప్టెన్ కొనియాడాడు.

ఇక ఈ #MyIPLmoment చాలెంజ్‌లో డూప్లెసిస్ చెన్నై మాజీ ప్లేయర్ మైక్ హస్సీ పేరును నామినేట్ చేశాడు.

Story first published: Thursday, April 16, 2020, 19:07 [IST]
Other articles published on Apr 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X