
తొలి భారత ప్లేయర్‌గా..
ముంబై తరఫున గత ఏడాది 16 మ్యాచ్‌లాడిన హార్దిక్ 191.42 స్ట్రైక్‌రేట్‌తో 402 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 14 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ముంబై జట్టు ఐపీఎల్ 2019 సీజన్ టైటిల్ గెలవడంలో ఈ ఆల్‌రౌండర్ క్రియాశీలక పాత్ర పోషించాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఓ సీజన్‌లో 400పైచిలుకు పరుగులు, 10కిపైగా వికెట్లు పడగొట్టిన భారత్ ప్లేయర్‌గా హార్దిక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

వెన్ను గాయంతో జట్టుకు దూరం..
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం వెన్ను గాయంతో భారత జట్టు నుంచి తప్పుకున్న ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్...
గాయానికి సర్జరీ చేయించుకొని పునరాగమన కోసం ఎదురు చూస్తున్నాడు. న్యూజిలాండ్ పర్యటనతోనే ఈ పవర్ హిట్టర్ రీఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. ఫిట్ టెస్ట్‌లో విఫలమవడంతో నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కే పరిమితమయ్యాడు.

దేశవాళీ టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్..
అనంతరం ముంబై వేదికగా జరిగిన దేశావాళీ టోర్నీ డీవై పాటిల్ టీ20 టోర్నీలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో తాను పూర్తి ఫిట్‌నెస్ సాధించానని యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. దీంతో గత నెలలో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికయ్యాడు.
ఈ సిరీస్‌తో పాండ్యా రీ ఎంట్రీ ఖాయమని భావించిన ఫ్యాన్స్ ఆశలపై వర్షం, కరోనా నీళ్లు జల్లాయి. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోగా.. మిగిలిన రెండు వన్డేలు కరోనా దెబ్బతో అర్దాంతరంగా రద్దయ్యాయి.

పాండ్యా వ్యూహాలను దెబ్బతీసిన కరోనా
ఇక ఐపీఎల్‌తోనైనా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలనుకున్నాడు. ఈ సీజన్‌లో రాణించడం ద్వారా వరల్డ్‌కప్ టీమ్‌లోకి ఎంపికవ్వాలని ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఆశించాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ 2020 నిరవధికంగా వాయిదాపడటంతో ఈ ఆల్‌రౌండర్‌కు అవకాశం దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి టీమిండియా కంటే.. ఐపీఎల్‌లోనే హార్దిక్ పాండ్యాకి తిరుగులేని రికార్డ్‌లున్నాయి. ధోనీ తరహాలో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చే ఈ పవర్ హిట్టర్.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు ఫలితాన్ని శాసించడంలో సిద్ధహస్తుడు. అటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా పాండ్యాకు తిరుగులేదు.


Click it and Unblock the Notifications












