న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదేందయ్యో ఇది!! కీపర్ చేతిలోనే బంతి.. 2 పరుగులు తీసిన బ్యాట్స్‌మెన్!!

European Cricket Series: Batsmen gets 2 Runs when ball in wicket keeper hands

హైదరాబాద్: క్రికెట్ ఆటలో ఎన్నో అద్బుతాలు జరుగుతాయి. బ్యాట్స్‌మన్‌ మెరుపు సెంచరీలు చేయడం.. బౌలర్ సంచలన ప్రదర్శన చేయడం.. ఫీల్డర్ ఊహించని రీతిలో క్యాచులు పట్టడం మనం చూస్తూఉంటాం. కానీ మునుపెన్నడూ లేని రీతిలో కీపర్ చేతిలోనే బంతి ఉండగానే.. ఓ బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు తీశాడు. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో చోటుచేసుకుంది. కీపర్ చేతిలో బంతి ఉండగానే.. కాదుకాదు అతడు చూస్తుండగానే.. బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు తీశారు. దీంతో మ్యాచ్ కాస్తా డ్రా అయింది. అసలు విషయంలోకి వెళితే...

చివరి బంతికి మూడు పరుగులు:

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో భాగంగా పాక్సెలోనా సీసీ-కటలున్యా టైగర్స్ మధ్య టీ10 మ్యాచ్‌ జరిగింది. పాక్సెలోనా సీసీ జట్టు విజయానికి చివరి బంతికి మూడు పరుగులు అవసరం అయ్యాయి. స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ అదాలత్ అలీ బంతిని బలంగా బాదాడు. అయితే బంతి బ్యాటును తాకకుండా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయినప్పటికీ అలీ మెరుపు వేగంతో పరుగు తీశాడు. బంతి అందుకున్న కీపర్.. ఇక తమ జట్టు గెలిచినట్టే అనే సంతోషంలో బంతి వికెట్లకు విసరకుండా పట్టుకుని నింపాదిగా స్టంప్స్ వద్దకు చేరుకున్నాడు.

రెండో పరుగు కోసం:

రెండో పరుగు కోసం:

రెండో పరుగు కోసం యత్నించిన అదాలత్ అలీ.. నాన్ స్ట్రైకర్‌ అజీమ్ ఆజంని రన్ కోసం పిలిచాడు. గమనించిన కీపర్ బంతిని పట్టుకుని వికెట్ల వద్ద రెడీగా నిలుచున్నాడు. అయితే అలీ వచ్చే వరకు క్రీజులోనే ఉన్న ఆజం.. అలీ రాగానే పరుగు కోసం వెళ్లాడు. దీంతో కీపర్ వెంటనే బంతిని బౌలర్‌కు అందించగా.. పిచ్ మధ్యలో ఉన్న అతడు వికెట్ల వైపు విసిరాడు. బంతి వికెట్లను తాకకుండా పక్కకు వెళ్ళిపోయింది. దీంతో పాక్సెలోనా జట్టుకు రెండు పరుగులు వచ్చాయి. మ్యాచ్ డ్రా అయింది.

గోల్డెన్ బాల్ రూపంలో:

గోల్డెన్ బాల్ రూపంలో:

చివరి బంతికి రెండు పరుగులు రావడంతో పాక్సెలోనా సీసీ-కటలున్యా టైగర్స్ మధ్య టీ10 మ్యాచ్ డ్రా అయింది. దీంతో మ్యాచ్ గోల్డెన్ బాల్ రూల్‌కు దారి తీసింది. యూరోపియన్ సిరీస్‌లో విజేతను ఇలానే నిర్ణయిస్తారు. గోల్డెన్ బాల్‌ రూల్‌లో చేజింగ్ జట్టుకు ఒక్క బంతి వేస్తారు. ఆ బంతికి రెండు, అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే విజేతగా పరిగణిస్తారు. పాక్సెలోనా జట్టు ఒకే ఒక్క పరుగు చేయడంతో కటలున్యా టైగర్స్ జట్టు విజయం సాధించింది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

IPL 2020: అమ్మో.. బయో బబుల్‌ ఓ పెద్ద నరకం!! బయటకు వెళ్లేందుకు కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టా: స్టార్ పేసర్

Story first published: Thursday, October 29, 2020, 20:53 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X