న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Australia: అదరగొట్టిన జోస్ బట్లర్.. ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్

England vs Australia: Jos Buttler Stars As England Clinch Australia T20 Series Win

సౌతాంప్టన్‌: జోస్‌ బట్లర్‌ (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో అదరగొట్టడంతో.. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), స్టొయినిస్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు 35) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ 2 వికెట్లు పడగొట్టగా... ఆర్చర్, మార్క్‌వుడ్‌ చెరో వికెట్‌ తీశారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 18.5 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్‌ బట్లర్‌ కడదాకా క్రీజులో నిలబడి గెలిపించగా.. డేవిడ్‌ మలన్‌ (32 బంతుల్లో 7 ఫోర్లు 42) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో అగర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆఖరి టీ20 రేపు (మంగళవారం) సౌతాంప్టన్ వేదికగా జరుగుతుంది.

డేవిడ్ వార్నర్ డకౌట్..

డేవిడ్ వార్నర్ డకౌట్..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ డకౌట్ అయ్యాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ(2)ని మార్క్ వుడ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో నిలకడకు మారుపేరైన స్మిత్ క్రీజులోకి రాగా.. అతను కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కెప్టెన్ ఫించ్‌తో సమన్వయలోపం కారణంగా స్మిత్(10) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పవర్ ప్లే ముగిసే ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు మాత్రమే చేసింది.

ఆదుకున్న ఫించ్, స్టోయినీస్..

ఆదుకున్న ఫించ్, స్టోయినీస్..

ఈ క్లిష్ట స్థితిలో జట్టును ఫించ్, స్టోయినీస్ ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. ఇక క్రీజులో కుదురుకున్న ఫించ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి జోర్డాన్ దెబ్బతీశాడు. దీంతో నాలుగు వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చి మ్యాక్స్‌వెల్(26), అగర్(23) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. చివర్లో కమిన్స్(13 నాటౌట్), స్టార్క్(2 నాటౌట్) వేగంగా ఆడటంతో ఆసీస్ 157 పరుగులు చేయగలిగింది.

చెలరేగిన బట్లర్, మలాన్

చెలరేగిన బట్లర్, మలాన్

స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ చేధించింది. ఓపెనర్ బెయిర్ స్టో(9) విఫలమైనా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ రఫ్ఫాడించాడు. అతనికి తోడుగా మలాన్ కూడా రాణించాడు. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. అనంతరం అగర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మలాన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన టామ్ బాంటన్(2), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(7) విఫలమైనా.. మోయిన్ అలీ(13 నాటౌట్) సాయంతో జోస్ బట్లర్ విజయాన్నందించాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ వరించింది.

ఇంగ్లండ్ టీమ్‌కు ఫైన్..

ఇంగ్లండ్ టీమ్‌కు ఫైన్..

ఇక తొలి టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ టీమ్‌పై ఫైన్ పడింది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడం ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తెలిపారు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ తప్పును అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండానే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Story first published: Monday, September 7, 2020, 8:03 [IST]
Other articles published on Sep 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X