న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లాక్‌డౌన్ రూల్స్ పాటించని పృథ్వీ షా.. అడ్డుకున్న పోలీసులు!

DC opener Prithvi Shaw stopped by police on way to Goa
Prithvi Shaw Stopped By Police క్రికెటర్ అయినా రూల్స్... పృథ్వీ షా కి చుక్కలు || Oneindia Telugu

ముంబై: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా.. అధికారుల అనుమతి లేకుండా గోవాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు అతన్ని మహారాష్ట్రలోని అంబోలీ జిల్లా వద్ద అడ్డుకున్నారు. పృథ్వీషా ఎంత ప్రాదేయపడినా పోలీసులు కనికరించలేదు. అందరికి రూల్స్ ఒకటేనని, స్టార్ క్రికెటర్ అయినా.. సామన్య పౌరుడైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో చేసేదేమిలేక పృథ్వీ షా గంటన్నర పాటు నిరీక్షించి మొబైల్ ఫోన్ ద్వారా అనుమతి పొందాడు.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

పూర్తి వివరాళ్లోకి వెళితే... కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్‌ 2021 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసినా విషయం తెలిసిందే. సజావుగా సాగుతున్న లీగ్‌లోకి దూసుకొచ్చిన వైరస్ వేగంగా ఆటగాళ్లకు సోకింది. దాంతో ప్లేయర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని లీగ్‌ను తాత్కలికంగా రద్దు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా ఇటీవల హోం ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్నాడు. అయితే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో పృథ్వీషాకు చోటు దక్కలేదు. దాంతో ఈ విరామ సమయాన్ని గోవాలో ఆస్వాదిద్దామనుకున్నాడు.

లాక్‌డౌన్‌తో..

లాక్‌డౌన్‌తో..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ కేంద్రం అన్ని విమానాలపై నిషేధం విధించింది. దీంతో తన సొంత కారులోనే పృథ్వీ షా గోవాకు బయలుదేరాడు. అయితే కరోనా విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్న ఈ పాస్‌ ఉంటేనే పోలీసులు అనుమతిస్తున్నారు.

పృథ్వీ షా వద్ద ఈపాస్‌ లేకపోవడంతో అంబోలీ జిల్లా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అతని కారును అడ్డుకున్నారు. అనుమతి లేకుండా గోవా వెళ్లడం కుదరదన్నారు. పృథ్వీ షా ఎన్నిసార్లు అడిగినా పోలీసులు ఒప్పుకోకవడంతో.. గంటపాటు వేచిఉండి తన మొబైల్‌ నుంచే ఈ పాస్‌‌కు దరశాస్తు చేశాడు. అనుమతి వచ్చిన తర్వాత పోలీసులకు చూపించి బయల్దేరాడు.

దుమ్మురేపిన షా..

దుమ్మురేపిన షా..

ఇక ఆసీస్‌ పర్యటనలో ఘోరంగా విఫలమై జట్టు నుంచి ఉద్వాసనకు గురైన పృథ్వీ షా ఆ తర్వాత దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోపీలో దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలు సాధించి 800కు పైగా పరుగులతో టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచి తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ 2021 సీజన్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓకే ఓవర్‌లో వరుగా 6 ఫోర్లు బాదాడు.

Story first published: Friday, May 14, 2021, 17:29 [IST]
Other articles published on May 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X