న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మన ఆటగాళ్లలా సూర్య కుమార్ దేశం వీడలేదే.. పాక్ క్రికెట్ బోర్డుపై డానీష్ కనేరియా ఫైర్

Danish Kaneria says Suryakumar Yadav will never leave India to play for other country, unlike some Pakistan cricketers

కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానీష్ కనేరియా మరోసారి ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ ఆటగాళ్లలా భారత్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్ దేశం వీడ లేదని, అతనికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), ఐపీఎల్ ఫ్రాంచైజీ అండగా ఉందన్నాడు. కానీ పాక్ ఆటగాళ్లకు అది కొరవడిందని, పీసీబీ వైఫల్యం కారణంగా ప్రతిభావంతులైన ఆటగాళ్లు దేశం వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా జాతీయ జట్టులో చోటు కోసం నీరీక్షించిన పాకిస్థాన్ యువ క్రికెటర్ సామి అస్లామ్.. ఎంతకీ అవకాశం రాకపోవడంతో తన మకాన్ని అమెరికాకు మార్చాడు.

అసహనంతో అమెరికాకు..

అసహనంతో అమెరికాకు..

ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికకాకపోవడం, అప్‌కమింగ్ న్యూజిలాండ్ సిరీస్‌లో చోటు దక్కకపోవడంతో అస్లామ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో తాను బలోచిస్తాన్ సెకండ్ ఎలెవన్‌కు కూడా డీమోట్ అయ్యాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అస్లామ్.. నేషనల్ టీ20 కప్ నుంచి కూడా తప్పుకున్నాడు. కానీ దేశవాళ్లీ టోర్నీలో మళ్లీ మూడు మ్యాచ్‌లు ఆడినా.. జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. దాంతో అస్లామ్ అమెరికా తరఫున బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు.

బంధుప్రీతి రాజ్యం ఏలుతుంది..

బంధుప్రీతి రాజ్యం ఏలుతుంది..

అస్లామ్ దేశం వీడటంపై యూట్యూబ్ వేదికగా స్పందించిన డానీష్ కనేరియా.. భారత్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇలా దేశం వీడటానికి సాహిసించడని, కనీసం ఆ ప్రయత్నం కూడా చేయడన్నాడు. ఎందుకంటే బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ అతనికి అండగా ఉన్నాయని తెలిపాడు. కానీ పాక్ క్రికెట్‌లో బంధు ప్రీతీ రాజ్యం ఏలుతుందని, దాంతో ప్రతిభావంతమైన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. పరోక్షంగా మాజీ ఆటగాళ్లపై విమర్శలు గుప్పించాడు.

స్టైరిస్ ఆఫర్ ఇచ్చినా..

‘సామి అస్లామ్ నిలకడైన ఆటగాడు. అతనికి తీవ్ర అన్యాయం జరిగింది. షాన్ మసూద్, ఇమామ్ ఉల్ హక్‌లా అతనికి ఏలాంటి అవకాశాలు దక్కలేదు. దురదృష్టవశాత్తు పీసీబీ వైఖరి కూడా ఆటగాళ్లను దేశం విడిచేలా చేస్తుంది. న్యూజిలాండ్ తరఫున ఆడాలని సూర్యకుమార్ యాదవ్‌కు స్కాట్ స్టైరిస్ ఆఫర్ ఇచ్చాడు. కానీ సూర్యకు బీసీసీఐ, అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ అండగా ఉంది. అందుకే అతను భారత్‌ను వీడడు. ఆ సాహసం కూడా చేయడు.'అని కనేరియా చెప్పుకొచ్చాడు.

సూర్యా.. కివీస్ వచ్చేయ్..

సూర్యా.. కివీస్ వచ్చేయ్..

ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నిలకడైన ప్రదర్శన కనబర్చిన అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు. సెలెక్టర్లు ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసిన ఏ జట్లలో అవకాశం ఇవ్వలేదు. దాంతో టీమ్ సెలెక్షన్‌పై తీవ్ర దుమారం రేగింది. సూర్యకు అవకాశం ఇవ్వాల్సిందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక సూర్యకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ భారత సెలక్టర్లకు కనువిప్పు కలిగే వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటే కనుక వెంటనే న్యూజిలాండ్ వచ్చేయాలని ట్వీట్ చేశాడు. ఈ ఆఫర్‌ను ప్రస్తావిస్తూనే కనేరియా పీసీబీపై విరుచుకుపడ్డాడు.

India vs Australia: టెస్ట్ సిరీస్ ముందు కోహ్లీసేనకు గట్టి షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!

Story first published: Monday, December 7, 2020, 19:33 [IST]
Other articles published on Dec 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X