India vs Australia: టెస్ట్ సిరీస్ ముందు కోహ్లీసేనకు గట్టి షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ నెగ్గి జోరు మీదున్న భారత జట్టుకు గట్టిషాక్ తగిలింది. ఫస్ట్ టీ20లో కంకషన్‌కు గురైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు టెస్ట్ సిరీస్‌లోని ఆరంభమ్యాచ్‌లకు దూరం కానున్నాడు. డిసెంబర్ 17 నుంచి మొదలయ్యే ఫస్ట్ టెస్ట్‌తో పాటు రెండో టెస్ట్‌లో జడేజా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం కంకషన్‌కు గురైన ఆటగాడు కనీసం వారం నుంచి 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. అయితే ఈ నిబంధనతో పాటు తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న జడేజా కోలుకోవడానికి మరో మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో జడేజా వార్మప్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

రిస్క్ చేయదు..
ఇక 10 రోజుల కంకషన్ విరామం తర్వాత రవీంద్ర జడేజా కోలుకున్నా... ప్రాక్టీస్ లేకుండా అతన్ని ఫస్ట్ టెస్ట్‌లో ఆడించే సాహసం చేయమని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. ‘ఐసీసీ కంకషన్ ప్రొటోకాల్స్ ప్రకారం.. ఆటగాడి తలకు గాయమైతే ఏడు నుంచి 10 రోజుల విశ్రాంతి తీసుకోవాలి. ఈ నిబంధన కారణంగా జడేజా డిసెంబర్ 11 నుంచి జరిగే మూడు రోజుల డేనైట్ వార్మప్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. కాబట్టి టీమ్‌మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ లేకుండా జడేజాను ఫస్ట్ టెస్ట్‌లో ఆడించే సాహసం చేయదు.'అని సదరు అధికారి హిందూస్థాన్ టైమ్స్‌కు తెలిపాడు.

తొడకండరాల గాయంతో..
ఇక ఫస్ట్ టీ20లో అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన జడేజా.. తొడకండరాల గాయానికి కూడా గురయ్యాడు. ఆ తర్వాత బంతి అతని తలకు తగిలింది. అయినా బ్యాటింగ్ కొనసాగించిన జడేజా.. ఇన్నింగ్స్ అనంతరం తల తిప్పినట్లు కావడంతో వైద్యులు పరీక్షించి కంకషన్ ఇంజ్యూరీగా తేల్చారు. దాంతో జడేజా స్థానంలో చాహల్ బరిలోకి దిగి మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే తొడకండరాల గాయం సీరియస్ అయితే జడేజా రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక జడేజాలాంటి ఆటగాడు ప్రతిష్టాత్మక సిరీస్‌లోని ఆరంభమ్యాచ్‌లకు దూరమవడం భారత్ ప్రతికూలమే.

అశ్విన్‌పైనే బాధ్యతలు..
ఇక జడేజా దూరమైతే జట్టు స్పిన్ బాధ్యతలు అశ్విన్‌పై పడనున్నాయి. అశ్విన్ కూడా టచ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియా-ఏ టీమ్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో అశ్విన్ రెండు కీలక వికెట్లు తీశాడు. : కామెరోన్ గ్రీన్(173 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 114 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించడంతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్-ఏ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. గ్రీన్‌కి తోడుగా కెప్టెన్ టీమ్ పైన్(44), నెసర్(33) రాణించారు. అంతకుముందు 237/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ టెస్ట్ టీమ్.. 247/9 వద్ద డిక్లేర్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications