Asia Cup 2022: ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వద్దు.. అతనే ముద్దు! రోహిత్‌కు కనేరియా అడ్వైజ్!

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022 టీ20 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో 15 రోజుల్లో ఈ మినీ ప్రపంచకప్‌కు తెరలేవనుంది. దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి. ఆగస్టు 28న ఈ మెగా మ్యాచ్ జరగనుంది. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఇరు జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఈ టోర్నీ అనంతరం ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో ఆసియా కప్‌కు మరింత క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే మాజీ క్రికెటర్లు తమ సలహాలు, సూచలను ఆయా జట్లకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం టీమిండియాకు విలువైన సలహాలు ఇచ్చాడు.

రాహుల్ వద్దు.. సూర్య ముద్దు!

రాహుల్ వద్దు.. సూర్య ముద్దు!

తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన కనేరియా.. టీమిండియా ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను ఆడించవద్దని సూచించాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్‌నే ఓపెనర్‌గా ఆడించాలన్నాడు. ‘ఆసియాకప్‌లో రోహిత్‌ శర్మ జోడీగా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. అతను విండీస్‌ పర్యటనలో రోహిత్‌‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వచ్చినప్పటికీ.. అతను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తే బాగుటుంది. రాహుల్‌ ఏ స్థానంలోనైనా అద్భుతంగా రాణించగలడు. అతడు గతంలో చాలా సార్లు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం మనం చూశాం. కాబట్టి రోహిత్‌తో కలిసి సూర్యకుమార్ టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది" అని కనేరియా అభిప్రాయపడ్డాడు.

ఇద్దరిది ఒకే బ్యాటింగ్ శైలి..

ఇద్దరిది ఒకే బ్యాటింగ్ శైలి..

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా వస్తే టీమిండియాకు భారీ నష్టం జరిగే అవకాశం ఉందని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమికి ప్రధాన కారణం ఈ ఇద్దరి వైఫల్యమేననే విషయం మరిచిపోవద్దంటున్నారు. ఇద్దరి బ్యాటింగ్ శైలి ఒకేలా ఉంటుందని, అటాకింగ్ గేమ్ కాకుండా నెమ్మదిగా ఆడుతారని గణంకాలతో సహా సూచిస్తున్నారు. మాములుగా రోహిత్ నెమ్మదిగా ప్రారంభించి కుదురుకున్న తర్వాత ధాటిగా ఆడుతాడు. రాహుల్ సైతం అదే శైలిని కొనసాగిస్తాడు. దాంతో ఆరంభంలో పరుగులు రాక ఒత్తిడి గురై ఇద్దరిలో ఒకరు నిర్లక్ష్యంగా షాట్ ఆడి ఔట్ అవుతారని హెచ్చరిస్తున్నారు. సెహ్వాగ్, శిఖర్ ధావన్ తరహా అటాకింగ్ ఓపెనర్‌ను తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

అన్యాయం... కెప్టెన్సీ మార్పు పట్ల నెటిజన్ల విమర్శలు *Cricket | Telugu OneIndia
సూర్యనే సరైనోడు..

సూర్యనే సరైనోడు..

గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు రాహుల్‌ అందుబాటులో లేకపోవడంతో భారత్‌ ప్రయోగాలు చేసింది. రోహిత్‌కు జోడీగా రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లను ప్రయత్నించింది. అయితే సూర్య దుమ్మురేపాడు. విండీస్ పర్యటనలోనాలుగు మ్యాచ్‌లు ఆడిన సూర్య 135 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే సూర్యను ఓపెనర్‌గా ఆడించి రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రాహుల్‌ సైతం పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించి జింబాబ్వే పర్యటనకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, August 12, 2022, 13:50 [IST]
Other articles published on Aug 12, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X