న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs MI: ధోనీసేనదే బ్యాటింగ్.. రోహిత్, హార్దిక్ లేకుండానే బరిలోకి ముంబై!

Chennai win toss and

దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లేకుండానే ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. తాత్కలిక సారథిగా కీరన్ పొలార్డ్ జట్టును నడిపి‌స్తున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో మొకాలి గాయానికి గురైన రోహిత్.. పూర్తిగా కోలుకున్నప్పటికీ లీగ్ భవిష్యత్తు దృష్ట్యా అతనికి రెస్ట్ ఇవ్వాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించిందని పొలార్డ్ తెలిపాడు.

ముంబై తరఫున అన్‌మోల్ ప్రీత్ సింగ్ అరంగేట్రం చేస్తుండగా.. రోహిత్ స్థానంలో సౌరభ్ తివారి జట్టులోకి వచ్చాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌‌‌కు ఊహించనట్లుగా సామ్ కరన్ దూరమవ్వగా.. గజ్జ గాయం నుంచి కోలుకున్న ఫాఫ్ డూప్లెసిస్ బరిలోకి దిగాడు.

పిచ్ పరిస్థితుల నేపథ్యంలోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని ధోనీ తెలిపాడు. ఇక సగం మ్యాచ్‌ల తర్వాత బ్రేక్ రావడం.. మళ్లీ మిగతా మ్యాచ్‌లు ఆడాల్సి రావడం ఆసక్తికరంగా ఉందన్నాడు. ఓవర్‌సీస్ కోటాలో ఫాఫ్ డూప్లెసిస్, డ్వేన్ బ్రావో, హజెల్ వుడ్, మోయిన్ అలీ జట్టులోకి వచ్చారని తెలిపాడు.

భారత్ సీజన్‌ తొలి దశలో ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలతో 10 పాయింట్లు సాధించిన చెన్నై పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లతో ముంబయి నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ నాలుగు వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. ఆ మ్యాచ్‌లో పొలార్డ్‌ (34 బంతుల్లో 87) సృష్టించిన విధ్వంసం ఎప్పటికీ గుర్తుండిపోయేదే. భా రత్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన సీఎస్కే.. ఫ్లేఆఫ్‌కు చేరువలో ఉంది. యూఏఈ పిచ్‌లకు ఆ జట్టు ఆటగాళ్లు త్వరగా అలవాటు పడటం కీలకం. గతేడాది ఇక్కడే జరిగిన టోర్నీలో ఆ జట్టు పేలవ ప్రదర్శనతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈసారి ధోని బ్యాటుతో రాణించడం కీలకం. ఆ జట్టులో మొయిన్‌ అలీ, రైనా, జడేజా, దీపక్‌ చాహర్‌లపై మంచి అంచనాలున్నాయి.

తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్: ఫాఫ్ డూప్లెసిస్, రుతురాజ్‌ గైక్వాడ్, మొయిన్‌ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ధోనీ, శార్దూల్‌ ఠాకూర్, దీపక్‌ చాహర్‌, హేజిల్‌వుడ్‌

ముంబై ఇండియన్స్: క్వింటన్ డికాక్‌, ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్యా, ఆడమ్ మిల్నె, రాహు చాహర్, ట్రెంట్ బౌల్ట్‌, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Sunday, September 19, 2021, 19:34 [IST]
Other articles published on Sep 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X