న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌‌గా ధోని.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టన్నింగ్ ఫొటో షేర్ చేసిన మహీ

Cricketer MS Dhoni turns wildlife photographer, shares image of tiger at Kanha National Park

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే ప్రపంచకప్‌ సెమీస్ అనంతరం మైదానానికి దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న ఈ జార్ఖండ్ డైనమైట్.. ఆ తర్వాత జనవరి వరకు క్రికెట్ సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సూచించాడు.

ఆ తర్వాత కూడా ధోని నోరు విప్పకపోవడం.. బీసీసీఐ అతని పేరు కాంట్రాక్టుల నుంచి తొలగించడంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ధోనీ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా త‌న‌కు ల‌భించిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు.

 వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా..

వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా..

మొన్న పుట్టపర్తిలో ప్రత్యక్షమైన ఈ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్.. తాజాగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా అవతారమెత్తాడు.

సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే మహీ.. శుక్రవారం ఓ స్టన్నింగ్ ఫొటోతో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఓ పులి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. దానికి ‘పులిని ఫొటోలు తీయడానికి అది ఎక్కువ సమయం ఇవ్వదు. దొరికిన సమయంలోనే కెమెరాను క్లిక్‌మనిపించాలి. కన్హా పార్క్‌ను సందర్శించడం అద్భుతంగా ఉంది'అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. ఫొటోగ్రాఫర్‌గా తాను తీసిన ఫొటోనని మహీ చెప్పకనే చెప్పాడు.మధ్య ప్రదేశ్‌లోని ఈ కన్హా పార్క్‌ను జనవరిలో ధోని తన కుటుంబ సభ్యులతో సందర్శించినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్క్‌ను అతను విజిట్ చేయడం ఇదే తొలిసారని ఆ పార్క్ వెబ్‌సైట్‌ పేర్కొంది. చార్డెడ్ ప్లేన్‌లో ధోని అక్కడు వెళ్లినట్లు సమాచారం.

 పుట్టపర్తిలో భారత మాజీ కెప్టెన్

పుట్టపర్తిలో భారత మాజీ కెప్టెన్

ఇటీవల ధోని అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ధోని వ్యక్తిగత డాక్టర్‌ ముత్తు.. పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్‌ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్‌ ముత్తు కోసం ధోని పుట్టపర్తి వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆసుపత్రిని పరిశీలించిన ధోనికి బాబా విశిష్టత, సేవా కార్యక్రమాలను ట్రస్ట్‌ సభ్యులు వివరించిన సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు.. అతన్ని ఘనంగా సన్మానించారు.

హర్మన్ ప్రీత్ కెప్టెన్సీ వదులుకో : మాజీ క్రికెటర్

రాహుల్ రాకతో సైడ్ ట్రాక్..

రాహుల్ రాకతో సైడ్ ట్రాక్..

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కీపింగ్ గ్లౌవ్స్ అందుకోవడంతో ధోని భవితవ్యంపై జరిగిన చర్చ సైడ్ ట్రాక్ అయింది. ఆస్ట్రేలియా సిరీస్‌లో పంత్ అనూహ్య గాయంతో కీపింగ్ గ్లౌవ్స్‌ను అందుకున్న రాహుల్.. ఆ సిరీస్‌లో బ్యాట్‌తో పాటు వికెట్ల వెనుకాల అద్భుతంగా రాణించాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తన పెర్పామెన్స్ మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. వన్డే సిరీస్‌లో కూడా బ్యాటింగ్, కీపింగ్‌లో మెరిసాడు.

ఐపీఎల్‌తో పునరాగమనం..

ఐపీఎల్‌తో పునరాగమనం..

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 సీజన్‌తో ధోని రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. చెన్నైసూపర్ కింగ్స్ సారథి అయిన ఈ జార్ఖండ్ డైనమెట్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇక ధోని భవితవ్యం ఐపీఎల్‌తో తేలనుందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడిన విషయం తెలిసిందే. మహీ టీమిండియాకు ఆడినా ఆడకపోయినా.. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా ఐపీఎల్‌ ఆడుతాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌ ఇదివరకే స్పష్టం చేసారు.

Story first published: Friday, February 14, 2020, 18:50 [IST]
Other articles published on Feb 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X