న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: లీడింగ్ బ్యాట్స్‌మెన్.. టాపర్ ఆఫ్ ది బ్యాచ్ క్రిస్ గేల్

CPL 2020: Top Four run-scorers of Caribbean Premier League, Chris Gayle tops the list

హైదరాబాద్: కరోనా కారణంగా క్రికెట్ సందడి లేక.. నిరాశకు గురైన అభిమానులను అలరించేందుకు కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్ సిద్దమవుతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు ముందే ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ ధనాధన్ లీగ్ యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.ప్రేక్షకుల్లేకుండా ట్రినిడాడ్​, టొబాగో‌ వేదికగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో కరోనా నిబంధనల మధ్య జరుగనుంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు అక్కడికి చేరి క్వారంటైన్‌ను కూడా పాటిస్తున్నారు. 2013లో ప్రారంభమైన సీపీఎల్.. గత ఏడు సీజన్లుగా అభిమానులను అలరించింది. ఎన్నో అద్భుత ప్రదర్శనలు.. మరెన్నో మైమరిపించే ఘనతలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇక ఈ లీగ్‌లో బ్యాట్‌తో మెరిసిన టాప్-4 ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

క్రిస్ గేల్..

క్రిస్ గేల్..

ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో తన విధ్వంసకరమైన ఆటతో రాణించే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. సీపీఎల్‌లో కూడా అదరహో అనిపించాడు. మరెవరికి సాధ్యం కానీ టీ20 రికార్డులను నెలకొల్పాడు. ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్లలో టాపర్ ఆఫ్ ది బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మొత్తం 76 మ్యాచ్‌లు ఆడిన గేల్ 39.23 సగటుతో 2354 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ లీగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఈ జమైకా వీరుడిదే కాగా.. అత్యధిక సిక్స్‌లు బాదిన ఘనత(162) కూడా అతనిదే. ఇక వ్యక్తిగత కారణాలతో గేల్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.

లెండిల్ సిమ్మన్స్

లెండిల్ సిమ్మన్స్

ఈ టోర్నీలో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్ లెండిల్ సిమ్మన్స్. ప్రతీ సీజన్ ఆడిన ఈ కుడిచేతివాటం బ్యాట్స్‌మన్ మొత్తం ఐదు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు 71 మ్యాచ్‌లు ఆడిన ఈ టాపార్డర్ బ్యాట్స్‌మన్ 33.01 సగటుతో 2080 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలున్నాయి. తద్వారా ఈ టోర్నీలో అత్యధికంగా అర్థ శతకాలు బాదిన ఆటగాడిగా ఘనత వహించాడు. మొత్తం 168 ఫోర్లు, 105 సిక్స్‌లు బాదాడు. ఈ అప్‌కమింగ్ సీజన్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఆండ్రూ ఫ్లెచర్..

ఆండ్రూ ఫ్లెచర్..

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రూ ఫ్లెచర్ థర్డ్ లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. 66 మ్యాచ్‌ల్లో 31.16 సగటుతో 1870 పరుగులు చేశాడు. ఇందుల్లో 11 హాఫ్ సెంచరీలు ఉండగా.. అతని స్ట్రైక్ రేట్ 117.31 కావడం విశేషం. ఇప్పటి వరకు 148 ఫోర్లు, 84 సిక్స్‌లు బాదిన ఫ్లెచర్.. ఈ సీజన్‌లో సెయింట్ లూసియా జూక్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

జాన్సన్ చార్లెస్..

జాన్సన్ చార్లెస్..

వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ అయిన జాన్సన్ చార్లెస్ సీపీఎల్ ఫోర్త్ లీడింగ్ రన్నర్. ఇప్పటి వరకు 68 మ్యాచ్‌లు ఆడిన అతను 27.90 యావరేజ్‌తో 1842 రన్స్ చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉండగా.. 97 అత్యధిక స్కోర్. ఈ సీజన్‌లో బార్బడోస్ ట్రిడెంట్స్ తరఫున బరిలోకి దిగనున్న చార్లెస్.. ఇప్పటి వరకు 80 సిక్స్‌లు, 160 ఫోర్లు బాదాడు.

Story first published: Tuesday, August 11, 2020, 17:52 [IST]
Other articles published on Aug 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X