న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా సక్సెస్‌కు ఆయనే కారణం: పుజారా

Cheteshwar Pujara Says Rahul Dravid helped me understand the importance of switching off from cricket

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, దివాల్ రాహుల్ ద్రవిడ్‌పై నయావాల్ చతేశ్వర్ పుజారా ప్రశంసల జల్లు కురిపించాడు. దిగ్గజ ఆటగాడైన ద్రవిడ్‌తో తనను పోల్చడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. ద్రవిడ్‌ పైన తనకు ఉన్న అభిమానాన్ని ఒక్క మాటలో చెప్పలేనని, ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చకున్నానని తెలిపాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పుజారా.. ద్రవిడ్ సూచనలు, సలహాలు తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయన్నాడు.

'నేను క్రికెట్‌లో ఈ స్థాయిలో రానించడానికి ద్రవిడ్ కూడా ఓ కారణం. ఆయన సలహాలు, సూచనలు నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆట ఒత్తిడి నుంచి బయటకు ఎలా రావాలి.. వ్యక్తిగత, క్రీడా జీవితాలను వేరువేరుగా ఎలా చూడాలి.. అనే విషయాలు ఆయన నుంచే నేర్చుకున్నాను. ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తుపై అవగాహన కలుగుతుంది'ని పుజారా చెప్పుకొచ్చాడు.

ఆటపై ఎక్కువగా దృష్టి సారించాలని చాలా మంది తనకు చెబుతుంటారని, అయితే తాను ఆటను ఎప్పడూ తక్కువ చేయలేదని, దాని ఒత్తిడి తనపై లేకుండా చూసుకుంటానని పుజారా చెప్పుకొచ్చాడు. ఈ ఆలోచనా విధానం ద్రవిడ్ నుంచే తాను నేర్చుకున్నానని పేర్కొన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడటం డొమెస్టిక్ క్రికెట్ ఆడే రోజుల్లోనే నేర్చుకున్నానని తెలిపాడు.

క్రికెట్‌లో నెపోటిజమ్ లేదా? సచిన్ కొడుకనే అర్జున్‌ టెండూల్కర్‌ను ఎంపిక చేయలేదా?క్రికెట్‌లో నెపోటిజమ్ లేదా? సచిన్ కొడుకనే అర్జున్‌ టెండూల్కర్‌ను ఎంపిక చేయలేదా?

Story first published: Saturday, June 27, 2020, 19:00 [IST]
Other articles published on Jun 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X