
బుమ్రా వెన్ను భాగంలో
బుమ్రా వెన్ను భాగంలోని ఎముక కొద్దిగా చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వెంటనే మేల్కొన్న బీసీసీఐ అతడికి మెరుగైన చికిత్స కోసం ఏర్పాట్లు చేసింది. దీంతో స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాతో సిరిస్‌లకు బుమ్రాను ఎంపిక చేయలేదు. వచ్చే జనవరిలో జరిగే న్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఐపీఎల్‌లో ముంబై జట్టుకు
ఐపీఎల్‌లో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. "ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు శివజ్ఞానమ్ ప్రధాన కన్సల్టెంట్‌గా ఉన్నారు. అయితే, ఐపీఎల్‌లో లేనప్పుడు ఎవరితోనైనా అతడు పనిచేసేందుకు వెసులుబాటు ఉంది. ఇది పూర్తిగా ఇద్దరి మధ్య వ్యక్తిగత ఒప్పందం" అని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
20 ఫ్రాన్సీల వెండినాణెం విడుదల: జీవించి ఉన్న తొలివ్యక్తిగా రోజర్ ఫెదరర్ (వీడియో)
|
శివజ్ఞానమ్‌తో కలిసి జిమ్‌తో శిక్షణ
శివజ్ఞానమ్‌తో కలిసి జిమ్‌తో శిక్షణ పొందుతున్న వీడియోను బుమ్రా సోమవారం పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యాదృచ్ఛికం ఏంటంటే ఈ ఏడాది ఆగస్టులో బీసీసీఐలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ట్రైనర్లలో శివజ్ఞానమ్ కూడా ఒకడు. అయితే, ఈ స్థానం కోసం న్యూజిలాండ్‌కు చెందిన నిక్ వెబ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

భారత ప్రధాన పేసర్‌గా
ఇక, టీమిండియా అత్యంత విజయవంతమైన బౌలర్లలో బుమ్రా ఒకడు. అంతేకాదు వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా పేరిట అరుదైన రికార్డు ఉంది. టీమిండియా తరుపున ఇప్పటివరకు 12 టెస్టుల్లో 62 వికెట్లు, 58 వన్డేల్లో 103, 42 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు.