న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#BoycottSwiggy: రోహిత్ శర్మ‌ను కించపర్చేలా స్విగ్గీ ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్.!

 BoycottSwiggy trends on Twitter after their distasteful tweet on MIs Captain Rohit Sharma

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ చిక్కుల్లో పడింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఆ సంస్థ సరదాగా చేసిన ట్వీట్ మిస్ ఫైర్ అయింది. దాంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. తమ అభిమాన క్రికెటర్‌ను కించపరిచేలా స్విగ్గీ చేసిన ట్వీట్ ఉందని రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్విగ్గీని నిషేదించాలని డిమాండ్ చేయడంతో పాటు.. బాయ్ కట్ చేద్దామని పిలుపునిస్తున్నారు. దాంతో #BoycottSwiggy ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..!

ఇక రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ను ఉద్దేశించి ట్రోల్ చేసేవారంతా అతన్ని వడాపావ్ అని పిలుస్తుంటారు. గతంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా రోహిత్‌ ఫిట్‌నెస్‌‌ను ప్రశ్నిస్తూ వడపావ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మహారాష్ట్రలో పాపుల్ డిష్ అయిన వడాపావ్‌ను రోహిత్ ఎక్కువగా తింటాడని అందుకే అలా బొద్దుగా ఉంటాడని గతంలో అతనిపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ఇది తెలియని స్విగ్గీ పప్పులో కాలేసింది. వడాపావ్ స్టాల్‌ దగ్గరకు రోహిత్ వెళ్లినట్లు ఓ యూజర్ ఎడిట్ చేసిన ఫొటోను ట్వీట్ చేశాడు. దానికి హేటర్స్.. ఇది ఖచ్చితంగా ఫోటోషాపే అంటారు'అనే క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అయితే ఇది సరదా ట్వీట్ అని భావించిన స్విగ్గీ.. ఆ ట్వీట్‌ను షేర్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురైంది.

ట్వీట్ తొలగించినా..

అభిమానులను నుంచి ఆగ్రహం వ్యక్తమవ్వడంతో అప్రమత్తమైన స్విగ్గీ.. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిమానులు.. స్విగ్గీని బహిష్కరించాలని పిలుపు నిస్తున్నారు. కొంతమంది అయితే స్విగ్గీ యాప్‌లను డిలీట్ చేశామనే స్క్రీన్ షాట్స్‌ను కూడా ట్విటర్ వేదికగా పంచుకుంటూ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ ఆటగాడికి కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని అందరూ ఖండించాలని ఓ యూజర్ విజ్ఞప్తి చేశాడు. అది విరాట్ ఫ్యాన్ అయినా ఇంకెవరైనా.. ఇలాంటి పునరావృతం కాకుండా బుద్ది చెప్పాలన్నాడు.

జొమాటో ఫుల్ హ్యాపీ..

తమ అభిమాన హిట్టర్ అవమానించినందుకు స్విగ్గీ యాప్‌ను తొలగిస్తున్నామని ఒకరు కామెంట్ చేస్తే.. ఇలాంటి ట్వీట్లు చేయడానికి సిగ్గుండాలని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత వైస్ కెప్టెన్ అవమానపర్చడం ఏ మాత్రం సమంజసం కాదని, వెంటనే బహిరంగ క్షమాణలు చెప్పాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. స్విగ్గి చేసిన తప్పిదంతో జొమాటో పండుగ చేసుకుంటుందనే మీమ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్‌ను అవమానించడానికి స్విగ్గీకి ఎంత ధైర్యమని మరొకరు ప్రశ్నించారు.

మేం రోహిత్‌ను కించపర్చలేదు..

రోహిత్ అభిమానులు ఆగ్రహం నేపథ్యంలో స్విగ్గీ స్పందించింది. తాము ఏ మాత్రం రోహిత్ శర్మను కించపర్చాలని ఆ ట్వీట్‌ను షేర్ చేయలేదని, పాజిటివ్ కోణంలోనే పంచుకున్నామని స్పష్టం చేసింది. ఆ ఫొటో తాము చేసింది కాదని, ఓ అభిమాని చేసిన ట్వీట్‌ సరదాగా ఉందని, అభిమానులను ఆకట్టుకుందనే ఉద్దేశంతోనే షేర్ చేశామని, ఎవరిని కించపరచాలని మాత్రం కాదని పేర్కొంది. మేము ఎప్పుడూ పల్టాన్‌‌‌ను అభిమానిస్తామని రోహిత్ అభిమానులకు ప్రత్యేకంగా విన్నవించింది.

Story first published: Tuesday, April 13, 2021, 23:15 [IST]
Other articles published on Apr 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X