టీమిండియా హోమ్ సీజన్ 2026-27 షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు 17 వేదికల్లోజరగనున్నాయి. ఈ హోమ్ సీజన్‌లో హైదరాబాద్ వేదికగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఒక వన్డే, టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ముందుగా వెస్టిండీస్ మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్ పర్యటన కొనసాగనుంది. డిసెంబర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం శ్రీలంక భారత్ పర్యటనకు రానుంది. డిసెంబర్ 13 నుంచి 27 వరకు భారత్, శ్రీలంక మధ్య టీ20, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి.
వచ్చే ఏడాది జనవరిలో మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే.. భారత పర్యటనకు రానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 27 వరకు భారత్ పర్యటనకు రానుంది. ఇరు జట్లు మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో ఒక టీ20, జింబాబ్వేతో ఒక వన్డే మ్యాచ్ జరగనున్నాయి.

వన్డే సిరీస్:
సెప్టెంబర్ 27: మొదటి వన్డే - తిరువనంతపురం
సెప్టెంబర్ 30: రెండో వన్డే - గువహటి
అక్టోబర్ 03: మూడో వన్డే - న్యూ చండీగఢ్
టీ20 సిరీస్:
అక్టోబర్ 06: మొదటి టీ20 - లక్నో
అక్టోబర్ 09: రెండో టీ20 - రాంచీ
అక్టోబర్ 11: మూడో టీ20 - ఇండోర్
అక్టోబర్ 14: నాలుగో టీ20 - హైదరాబాద్
అక్టోబర్ 17: ఐదో టీ20 - బెంగళూరు
డిసెంబర్ 13: తొలి వన్డే- ఢిల్లీ
డిసెంబర్ 16: రెండో వన్డే-బెంగళూరు
డిసెంబర్ 19: మూడో వన్డే-అహ్మదాబాద్
డిసెంబర్ 22: తొలి టీ20- రాజ్‌కోట్
డిసెంబర్ 24: రెండో టీ20- కటక్
డిసెంబర్ 27: మూడో టీ20- పుణె
జనవరి 3: తొలి వన్డే-కోల్‌కతా
జనవరి 6: రెండో వన్డే-హైదరాబాద్
జనవరి 9: మూడో వన్డే- ముంబై
తొలి టెస్టు: జనవరి 21 నుండి - నాగ్‌పూర్
రెండో టెస్ట్: జనవరి 29-ఫిబ్రవరి 2, చెన్నై
మూడో టెస్ట్: ఫిబ్రవరి 11-ఫిబ్రవరి 15, గువహతి
నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 19-ఫిబ్రవరి 23, రాంచీ
ఐదో టెస్ట్: ఫిబ్రవరి 27-మార్చి 3, అహ్మదాబాద్