న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐకి సిగ్గులేదు.. గంగూలీ, జై షా భారత క్రికెట్‌ను నాశనం చేస్తున్నారు! కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!

 BCCI President Sourav Ganguly Spoiling Indian Cricket Says Virat Kohli Fans

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షాకిచ్చింది. వన్డే సారథ్య బాధ్యతలను తప్పించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు వన్డే సారథ్య బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు ఆలిండియా సెలెక్షన్ కమిటీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావించకుండా.. రోహిత్ శర్మనే తదుపరి వన్డే కెప్టెన్ అని పేర్కొంటూ సింపుల్‌గా తెలియజేసింది.

అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్రంగా హర్ట్ అయ్యారు. బోర్డు తీసుకున్న నిర్ణయం ఏం బాలేదని మండిపడుతున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#ShameonBCCI ట్రెండింగ్..

బీసీసీఐకి సిగ్గులేదంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్న కోహ్లీ అభిమానులు.. #ShameonBCCI అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన విరాట్ కోహ్లీకి కనీస గౌరవం ఇవ్వకుండా అతని ఘోరంగా అమానించారని ఫైర్ అవుతున్నారు. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన ఘనతలను ప్రస్తావిస్తూ.. ఇతర సారథుల రికార్డులను పోల్చుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.

కెప్టెన్‌గా వన్డేల్లో కోహ్లీకి సూపర్ రికార్డ్ ఉంది. తను కెప్టెన్సీ చేసిన 95 మ్యాచ్‌ల్లో భారత్ 65 మ్యాచ్‌ల్లో నెగ్గింది. కేవలం 27 సార్లే ఓడింది. భారత సారథుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ధోనీ కన్నా మెరుగైన విజయాల శాతం ఉంది. వన్డేల్లో విరాట్ కోహ్లీ వన్డే పర్సంటేజ్ 70 శాతం ఉంటే.. కేన్ విలియమ్సన్‌ది మాత్రం 55గానే ఉందని, కానీ విలియమ్సన్‌ను ఈ తరం అత్యుత్తమ కెప్టెన్‌గా కీర్తిస్తారని ఫ్యాన్స్ బీసీసీఐపై సెటైర్లు పేల్చుతున్నారు.

చట్ట విరుద్దంగా..

ఇక బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ చట్ట విరుద్దంగా పదవుల్లో ఉంటూ పనికిమాలిన పనులు చేస్తున్నారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ రాజ్యంగం ప్రకారం వీరి పదవి కాలం ముగిసిందని, దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉందని గుర్తు చేస్తున్నారు. జూలై 2020నాటికి పదవి కాలం పూర్తయినా.. ఈ కేసు వాదనలు వినేందుకు సుప్రీం సిద్దంగా లేదని మండిపడుతున్నారు.

భారత క్రికెట్‌ను పూర్తిగా నాశనం పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. భారత జట్టుకు ఎన్నో విజయాలందించిన కోహ్లీకి కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని, అతని సేవలను గుర్తిస్తూ కృతజ్ఞతలు కూడా తెలపలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రిచెస్ట్ బోర్డు.. కానీ

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన బోర్డే కానీ, కనీస విలువలు లేవని కామెంట్ చేస్తున్నారు. 'సరైన సమాచారం ఇవ్వకుండా... కనీస గౌరవం ఇవ్వకుండా.. ఐదేళ్లుగా జట్టును నడిపించిన కెప్టెన్‌ను దారుణంగా అవమానించిన బీసీసీఐ.. రిచెస్ట్ బోర్డే కానీ విలువలు ఏ మాత్రం లేవని'ఓ యూజర్ పేర్కొన్నాడు. అన్ని క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లకు గౌరవం ఇస్తూ హై క్రియేట్ చేస్తుంటే బీసీసీఐ మాత్రం దారుణంగా అవమానిస్తుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ కాదు తప్పియ్యాల్సింది.. జైషా, సౌరవ్ గంగూలీలని మరికొందరు సూచిస్తున్నారు.

కోహ్లీ X రోహిత్ ఫ్యాన్స్!

ఇక విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పోయిందన్న బాధలో అతని అభిమానులుంటే.. రోహిత్ కెప్టెన్ అయ్యాడనే సంతోషంలో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కొందరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాడికి మద్దతు తెలుపుతూ ఇతర ఆటగాడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ రచ్చమొదలైంది.

టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఓటమికి రోహిత్ శర్మనే కారణమని కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 34 ఏళ్ల వయసులో ఏ మాత్రం ఫిట్‌నెస్‌లేని రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చి భారత జట్టును నాశనం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఏడుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లున్నారని, వారి వైఫల్యమే జట్టు ఓటములకు కారణమంటున్నారు.

Story first published: Thursday, December 9, 2021, 14:08 [IST]
Other articles published on Dec 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X