న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిబ్రవరి 18న ఐపీఎల్ 2021 వేలం!

 BCCI official says IPL 2021 auctions likely on Feb 18

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్) 2021 సీజన్‌కు సంబంధించి మినీ వేలం ఫిబ్రవరి 18న జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ పాలకమండలి త్వరలోనే మినీ వేలంపై ఓ నిర్ణయం తీసుకోనుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. 'ఐపీఎల్‌ మినీ వేలం ఫిబ్రవరి 18న జరుగనుంది. మేదికను కూడా నిర్ణయించాల్సి ఉంది.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

ఇక ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2021 సీజన్ మినీ వేలం కోసం ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు... డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు ప్రమోషన్లూ ఇస్తున్నాయి. నైపుణ్యం ఉన్నా.. అవకాశాలు ఇవ్వలేని ప్లేయర్లను వేలంలోకి పంపించడంతో పాటు అవసరం వస్తారనుకున్న క్రికెటర్ల కోసం మరోసారి కోట్లు వెచ్చించేందుకు రెడీ అవుతున్నాయి. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బడ్జెట్, లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కుర్రాళ్ల వేటలో పడ్డాయి.

ఈ ఏడాది వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కోసం రూ.196కోట్లను ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. గత బుధవారమే ఫ్రాంచైజీలన్నీ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఇక ట్రేడింగ్ విండో గడవు ఫిబ్రవరి 4న ముగియనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో గత సీజన్‌ను దుబాయ్ వేదికగా నిర్వహించగా.. తాజా సీజన్‌ను మాత్రం భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ నిర్వహణను బట్టి ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకోనుంది. ఫిబ్రవరి 5 నుండి ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Story first published: Friday, January 22, 2021, 19:05 [IST]
Other articles published on Jan 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X