Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం దంచుడురా సామీ.. 350 కొడితేనే గ్యారంటీ!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారుతోంది. బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సీజన్లో ఏకంగా 240, 260 పరుగులు చేసినా జట్లు ఓడిపోవడం చూస్తుంటే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు చేసినా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ 243 పరుగులు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ 229 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సత్తా చాటింది. ఐపీఎల్ చరిత్రలోనే టాప్-5 అతిపెద్ద రన్ ఛేజ్‌లలో మూడు ఈ ఒక్క సీజన్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం.

ఐస్‌లాండ్ క్రికెట్ వ్యంగ్యాస్త్రం.. 350 రన్స్ ఉంటేనే ధీమా!
ఐపీఎల్‌లో జరుగుతున్న ఈ రన్స్ జాతరను చూసి ఐస్లాండ్ క్రికెట్ బోర్డు తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. "ఈ రోజుల్లో ఐపీఎల్‌లో మొదట బ్యాటింగ్ చేసే జట్టు సురక్షితంగా ఉండాలి అంటే కనీసం 350 పరుగులు చేయాలి" అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్ వేసింది. 200, 250 పరుగులు కూడా మంచులా కరిగిపోతుండటంతో ఐస్లాండ్ క్రికెట్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

IPL 2026 Iceland Cricket Suggests 350 Is The New Safe Tota Why Even 300 Runs Aren t Safe Details

ఒక్క సీజన్లోనే 10 సార్లు.. రికార్డులు బ్రేక్!
ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు కేవలం 41 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ తక్కువ సమయంలోనే జట్లు 10 సార్లు 200 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించాయి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఆల్-టైమ్ రికార్డు. గతేడాది 2025 సీజన్‌లో మొత్తం 74 మ్యాచుల్లో 9 సార్లు మాత్రమే ఇలాంటి రన్ చేజ్‌లు జరిగాయి. కానీ ఈ సీజన్లో ఇంకా 33 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆ రికార్డు బద్ధలైపోయింది. ఈ సీజన్లో జరిగిన 200+ రన్ ఛేజ్‌లలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆఖరి ఓవర్ వరకు వెళ్లాయంటే బ్యాటర్ల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ రూల్.. అసలైన విలన్?
పరుగుల వరదకు ప్రధాన కారణం 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన అని విశ్లేషకులు భావిస్తున్నారు. 2023లో ఈ రూల్ వచ్చినప్పటి నుంచి జట్ల బ్యాటింగ్ డెప్త్ బాగా పెరిగింది. ఫలితంగా బ్యాటర్లు భయం లేకుండా ఆడుతున్నారు. 2008 నుంచి 2022 వరకు (15 ఏళ్లు) ఐపీఎల్‌లో కేవలం 15 సార్లు మాత్రమే 200+ రన్ ఛేజ్‌లు జరగ్గా.. ఈ రూల్ వచ్చిన తర్వాత గత 4 ఏళ్లలోనే ఏకంగా 33 సార్లు జట్లు ఈ ఘనత సాధించాయి. దీనికి తోడు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు కూడా తోడవ్వడంతో బౌలర్లు నామమాత్రంగా మారిపోతున్నారు.

ఒక్క సీజన్‌లో 200+ సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్‌ల గణాంకాలు:
2026: 10 సార్లు (ఇంకా సీజన్ కొనసాగుతోంది)

2025: 9 సార్లు

2023: 8 సార్లు

2024: 6 సార్లు

Story first published: Thursday, April 30, 2026, 14:30 [IST]
Other articles published on Apr 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+