Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ముంబై, లక్నో ఔట్.. ఫైనల్ చేరే జట్లు ఇవే!

ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రతీ జట్టు కనీసం 8 మ్యాచ్‌లు ఆడాయి. మరో 6 మ్యాచ్‌లు ఆడితే టోర్నీ లీగ్ దశ ముగియనుంది. అయితే ఇప్పటి వరకు సాగిన టోర్నీ ఒక ఎత్తయితే ఇప్పటి నుంచి జరిగే టోర్నీ మరో స్థాయిలో ఉండనుంది. ఎందుకంటే తదుపరి 6 మ్యాచ్‌ల్లో వచ్చే ఫలితాలు ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. అందుకే ప్రతి జట్టు తమ సాయశక్తులా విజయం కోసం తమ సర్వస్వాన్ని ఒడ్డించనున్నాయి.

ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ఏంటంటే..?

లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచే జట్లే ప్లే ఆఫ్స్ చేరనున్నాయి. టాప్-2లో నిలిచే జట్లు క్వాలిఫయర్-1 ఆడనుండగా.. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.

మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడనుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది.

IPL 2026 Playoff Scenarios PBKS RCB and SRH Dominate MI and LSG on the Brink
Photo Credit: twitter (X)

ఫైనల్ చేరే జట్లే ఇవే..

ప్రస్తుతం 8 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 6 విజయాలు, 13 పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. ఆర్‌సీబీ 6 విజయాలు 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు జట్లు మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానున్నాయి. అంతేకాకుండా ఈ టోర్నీలో ఈ మూడు జట్లే ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఒకరిద్దరి ప్రదర్శనపై ఆధారపడకుండా మ్యాచ్ మ్యాచ్‌కు ఓ విన్నర్‌తో విజయాలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం ఫామ్ ప్రకారం ఈ మూడు జట్లకు ఫైనల్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా ఓపెనర్లపైనే ఆధారపడి ఉంది. కెప్టెన్ రియాన్ పరాగ్‌తో ఇతర ఆటగాళ్లు సత్తా చాటితేనే ఆ జట్టు ఫైనల్ చేరగలదు. ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్ల రన్‌రేట్ కూడా మెరుగ్గా ఉంది. అద్భుతం జరిగితే తప్పా ఇతర జట్లకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కే అవకాశం లేదు.

ముంబై, లక్నో ఔట్..

8 మ్యాచ్‌ల్లో 6 పరాజయాలతో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. ఈ రెండు జట్లు తమ చివరి 7 మ్యాచ్‌లకు ఏడు గెలిస్తే తప్పా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు. గెలవడమే కాకుండా మెరుగైన రన్‌రేట్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. గుజరాత్ టైటాన్స్.. చివరి 6 మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలవాలి. చెన్నై సూపర్ కింగ్స్ చివరి 6 మ్యాచ్‌ల్లో కనీసం ఐదు గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కనీసం ఐదు విజయాలు సాధించాలి. కేకేఆర్ 6 మ్యాచ్‌లకు 6 గెలవాలి. అద్భుతం జరిగితే తప్పా ఈ జట్లు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు.

Story first published: Thursday, April 30, 2026, 11:54 [IST]
Other articles published on Apr 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+