కింగ్ ఒకరు కాదు.. ఆరుగురు! IPL 2026లో ఆరెంజ్ ఆర్మీ సంచలనం!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజా విసురుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో 6 విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. అయితే ఈ విజయాల్లో ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏదైనా జట్టు గెలిస్తే ఒకరో ఇద్దరో స్టార్ ప్లేయర్లపై ఆధారపడుతుంది. కానీ ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి అలా లేదు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఒక్కో కొత్త హీరో పుట్టుకొస్తున్నాడు. గెలిచిన ఆరు మ్యాచుల్లో ఆరుగురు వేర్వేరు ఆటగాళ్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు అందుకోవడం జట్టు సమతూకానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నితీశ్ నుంచి క్లాసెన్ వరకు.. ఆరెంజ్ ఆర్మీ వీరులు వీరే!
ఈ సీజన్ ఆరంభంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై జరిగిన పోరులో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి తన ఆల్‌రౌండ్ ప్రతిభతో మెరిసి తొలి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ వంటి పటిష్టమైన జట్టుపై ప్రఫుల్ హింగే అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక సీఎస్కేపై జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఇషాన్ మలింగా తన యార్కర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ముద్ర వేయగా.. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మెరుపులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆరో విజయాన్ని అందించాడు.

ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఖుషీ.. ప్రత్యర్థులకు వణుకు!
ఒక్కరిద్దరిపైనే ఆధారపడకుండా జట్టులోని ప్రతి ప్లేయర్ బాధ్యత తీసుకోవడం చూస్తుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇక ఈ సీజన్‌లో తిరుగులేదని అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. "టీమ్ అంటే ఇలా ఉండాలి.. ఒకరు విఫలమైతే మరొకరు మ్యాచ్ గెలిపిస్తున్నారు" అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏ ఒక్క ఆటగాడిని కట్టడి చేసినా సరిపోదని, జట్టు మొత్తం ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థి జట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు ఓ సింహస్వప్నంగా మారింది. ఇలాగే కొనసాగితే ఈసారి ఐపీఎల్ ట్రోఫీ హైదరాబాద్‌కు రావడం ఖాయమని ఆరెంజ్ ఆర్మీ ధీమా వ్యక్తం చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications